గత కొద్ది రోజులుగా నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న వార్తల్లో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల సర్ప్రైసింగ్ ఎంగేజ్మెంట్ ఒకటి. కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ.. డేటింగ్ చేస్తున్నారంటూ.. వార్తలు వినిపించినా.. అక్కినేని అభిమానుల్లో మాత్రం అది రూమర్ అన్న అభిప్రాయం ఉండేది. అయితే ఒక్కసారిగా ఈ జంట ఆ వార్తలను నిజం చేస్తూ.. ఆగస్టు 8న ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. చైతన్య, సమంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో పడ్డారు. సీక్రెట్ గా వీరి ప్రేమను కొనసాగించిన ఈ జంట.. కొన్నిసార్లు కెమెరాకు చిక్కిన.. వారి ప్రేమ వార్తలపై రియాక్ట్ కాకుండా నిశబ్ం గా ఉన్నారు. ఇక రీసెంట్గా ఎంగేజ్మెంట్ జరుపుకున ఈ కపుల్.. ఎంగేజ్‌మెంట్ ఈవెంట్‌ను చాలా ప్రైవసీగా చేసుకున్నారు.
వీరి వివాహం త్వరలోనే జరుగునున్న సంగతి తెలిసిందే. అయితే శోభిత ఎంగేజ్మెంట్ చాలా తక్కువ మందితో జరిగినా.. వివాహాన్ని మాత్రం గ్రాండ్ లెవెల్లో చేయాలని భావిస్తున్నట్టు నాగార్జున కూడా ఇటీవల ఇంటర్వ్యూలో వివరించాడు. వివాహం చేయడానికి చైతు, శోభిత ఫ్యామిలీ మెంబర్స్ అంతా వేదిక వెతికారని.. వారి వివాహానికి రాజస్థాన్, మధ్యప్రదేశ్ లేదా విదేశాల్లో జరిపించాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ఈ ఏడాది చివర్లో లేదా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చ్‌లో వీరి వివాహానికి డేట్ ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందట. ఇక ఇప్పటికే నాగార్జున ఎంగేజ్మెంట్ ముహూర్తాన్ని బట్టి వెంటనే చేసేసాము. కానీ.. పెళ్ళికి కాస్త సమయం తీసుకొని గ్రాండ్ లెవెల్‌లో చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక చైతు, శోభిత ఇద్దరు సినీ ఇండస్ట్రీలో వ్యక్తులే అన్న సంగతి తెలిసిందే. ఇద్దరు హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అయితే ఇద్దరు కలిసి ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ.. వీరి మధ్యన ఎలా పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమాల ఎప్పుడు మారింది.. అనే సందేహాలు ఇప్పటికే ఎంతో మందిలో చిగురించాయి. ఇక నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాతనే ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడిందట. ఆ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో కలిసిన వీరు.. ఇద్దరి మధ్యన మంచి పరిచయం ఏర్పడడంతో.. అతి తక్కువ సమయంలోనే ప్రేమలో పడ్డారట.. అలా కొద్ది నెలల గ్యాప్ తోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.