శుభ‌వార్త చెప్తానంటూ సమంత షాకింగ్ పోస్ట్.. రెండో పెళ్లి గురించేనా..?

తెలుగు స్టార్ బ్యూటీ సమంతకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు గత కొంతకాలంగా మాయోసైటీస్ వ్యాధితో పోరాడుతూ.. సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరమైనా సమంత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇటీవల హెల్త్ ఫోడ్‌కాస్ట్ ప్రారంభించి.. అవేదికపై ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. అలాగే పలు బిజినెస్‌లు మొదలుపెట్టి.. ఫుల్ బిజీగా గ‌డుపుతుంది.Samantha Ruth Prabhuసోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ.. పోస్ట్లు పెడుతూ వార్తల్లో ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలో తాజాగా అమ్మడు మరో షాకింగ్ పోస్ట్ తో అభిమానుల్లో ఆసక్తి పెంచింది. త్వరలోనే ఓ గుడ్ న్యూస్ రాబోతుందంటూ పోస్ట్‌ని షేర్ చేసుకుంది. దాంతో అంద‌రిలో తమ పర్సనల్ లైఫ్ లో సంబంధించిన విషయమా.. లేదా సినిమాల గురించి చెప్తుందా అనే ఆసక్తి పెరిగిపోయింది. అలాగే ఆమె పోస్ట్ పెట్టిన దగ్గర నుంచి నెట్టింట ఆమె కూడా తన రెండో పెళ్లి గురించి అనౌన్స్ చేయబోతుందా.. అనే చర్చలు మొదలయ్యాయి. అమ్మడి ఇన్స్టా వేదికగా షాకింగ్ పోస్ట్ పై ప్రేక్షకుల ఉత్కంఠకు చెక్ పెట్టింది.సమంత ఇన్‌స్టా పోస్ట్.. వారికి సైలెంట్‌గా కౌంటర్ ఇచ్చిందా? | Latest Telugu  Movie News, Reviews, OTT, OTT Reviews, Ratingsఆమె ఓల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచౌజ్‌లో పార్ట్నర్‌గా పెట్టుబడులు పెట్టినట్టు.. అంతేకాదు మాజీ టెన్నిస్ క్రీడాకారుడు గౌరవ్‌తో క‌లిసి పికిల్ బాల్ లీగ్‌లోచెన్నై టీంకు యజమానికా వ్యవహరించనునట్లు వెల్లడించింది. ఎక్సైటింగ్ న్యూస్.. నేను థ్రిల్లింగ్ గా ఉన్న.. ఓల్డ్ పికెల్ బాల్ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజ్‌ తీసుకున్న. పికిల్ బాల్ ఫీవర్ భారతదేశాన్ని చుట్టూ ముట్ట‌నుంది. ఇది భారతదేశాన్ని కదిలించే టైం అంటూ వెల్లడించింది. గౌరవ్‌తో కలిసి తీసుకున్న ఫోటోతో పాటు.. అమ్మడు ఈ మేటర్ అంతా అభిమానుల‌తో షేర్ చేసుకుంది. అలాగే భంయాష్‌ట్యాగ్‌ న్యూ బిగినింగ్స్ అనే ట్యాగ్‌ను కూడా జత చేసింది. ప్రజెంట్ శామ్ పోస్ట్ వైరల్‌గా మారుతుండగా.. అది చూసిన నెటిజ‌న్స్‌ అంతా.. ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు.