రవితేజని ఘోరంగా ముంచేసిన ఆ ముగ్గురు లెజెండ్రీ హీరోలు.. అసలేం జరిగిందంటే..?

మాస్ మహారాజ్ రవితేజకు ప్రస్తుతం సినీ కెరీర్ పరంగా బ్యాడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా ఆయన నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో రవితేజ సినీ కెరీర‌ర్‌పై.. ఆయన మార్కెట్ పై ఇంపాక్ట్ పడింది. ఇటీవల వచ్చిన మిస్టర్ బ‌చ్చ‌న్‌ కూడా ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బీభత్సంగా బోల్తా పడింది. ఇదిలా ఉంటే రవితేజకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. మాస్ మహారాజ్‌ను నమ్ముకున్న ముగ్గురు లెజెండ్స్.. ఆయనను నట్టేట‌ ముంచేసారంటూ.. రామారావు, నాగేశ్వరరావు, అమితాబ్ ఈ ముగ్గురు స్టార్ హీరోలను నమ్ముకుని రవితేజ కెరీర్ స్పాయిల్ అయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో ఒకసారి చూద్దాం.Cinejosh Review: Ramarao On Duty సినీజోష్ రివ్యూ: రామారావు ఆన్ డ్యూటీరవితేజ నటించిన సినిమాల‌లో రామారావు ఆన్ డ్యూటీ ఒక‌టి. రామారావు పేరుతో ఈ సినిమా వ‌చ్చిన‌ సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగిగా మాస్ మ‌హారాజ్ నటించిన ఈ సినిమా శరత్ మండవ డైరెక్షన్‌లో తెరకెక్కింది. ఈ మూవీ రెండేళ్ల క్రితం రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ని అసలు మెప్పించలేకపోయింది. దీంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాపై మొదట్లో చాలా అంచనాలు పెట్టుకున్న రవితేజ.. ప్రెస్‌మీట్ లోను ఈ విషయాన్ని వెల్లడించాడు. కానీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం సినిమా బోల్తా కొట్టింది. అలా రామారావు.. రవితేజకు షాక్ ఇచ్చాడు.Tiger Nageswara Rao : 'టైగర్ నాగేశ్వరరావు' నా ఆల్ టైం ఫేవరేట్ మూవీ గా  నిలిచిపోతుంది - TeluguMirchi.comతర్వాత నాగేశ్వరరావుని నమ్ముకున్నాడు మాస్ మహారాజ్. టైగర్ నాగేశ్వరరావు పేరుతో సినిమాలో నటించాడు. నాగేశ్వరావు లైఫ్ ఆధారంగా వ‌చ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదట మంచి అంచనాలు ఉన్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెర‌కెక్కి గత ఏడాది రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాపై సాధారణ ప్రేక్షకులు కాదు.. ఇండస్ట్రీ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుందని అంచనాలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా కూడా భారీ పరాజయాన్ని చూసింది. లెంగ్త్ సమస్య అని.. ట్రిమ్ చేసిన ప్రయోజనం ఉండదని.. ఇలా ఎన్నో కామెంట్లు వ్యక్తం అయ్యాయి. ఇక నాగేశ్వరరావు కూడా రవితేజను ఘోరంగా ముంచేశాడు.Mr Bachchan review. Mr Bachchan Tamil movie review, story, rating -  IndiaGlitz.comఇక తాజాగా ఆయన ఎంతగానో అభిమానించే తన ఫేవరెట్ హీరో అమితాబ్బచ్చని నమ్ముకున్నాడు మాస్ మహారాజ్. బాలీవుడ్ లో హిట్ అయిన రైడ్ మూవీ తెలుగు రీమేక్ మిస్టర్ బ‌చ్చ‌న్. హరీష్ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించి మెప్పించింది. ఆమె సినిమాకు హైలైట్ అయింది. కానీ.. సినిమా డిజాస్టర్ అయింది. సినిమాని లేపేందుకు హరీష్ శంకర్ ప్రయత్నాలు చేసినా.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్. అంతేకాదు రవితేజ హీరోగా నటించిన రావణాసుర కూడా బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఏదైనా కంటెంట్ ఉన్న.. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఎంచుకొని నటించి ఉంటే బాగుండేది. దాన్ని విడిచి సాము చేస్తూ.. బలాన్ని వదిలేసి ఎక్స్పరిమెంట్లపై పడ్డాడు మాస్ మహారాజ్. ఆ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారు. ఈ క్రమంలోనైనా ఈ విషయంపై రియలైజ్ అయ్యి మంచి సినిమాలతో వస్తారని.. హిట్ కొడతారని అభిమానులు భావిస్తున్నారు.