వేణు స్వామి కపుల్ వర్సెస్ జర్నలిస్ట్ మూర్తి.. ఎవరి వాదన వాస్తవం అంటే..?

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి దంపతులు తాజాగా జర్నలిస్ట్‌ మూర్తిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.5 కోట్లు త‌మ‌నుంచి జర్నలిస్టు మూర్తి అడిగారంటూ చేసిన కామెంట్స్ నెటింట‌ సంచలనగా మారిన సంగతి తెలిసిందే. జర్నలిస్ట్ మూర్తి అనుచరుడు.. అమర్ అనే వ్యక్తి వారికి ఫోన్ చేసి రూ5కోట్లు అడిగినట్లు వేణి స్వామి దంపతులు చెప్పారు. మాకు ఆత్మహత్యే శ‌ర‌ణ్యం అంటూ వాళ్ళు చేసిన కామెంట్లు నెటింట‌ వైరల్‌గా మారాయి. ఇక గతంలో వేణు స్వామి ఎంతో మంది జాతకాలు చెప్పినా.. అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ.. తాజాగా స‌మంత‌, శోభిత జాతకాలను కంపేర్ చేస్తూ వేణు స్వామి చేసిన కామెంట్ల ద్వారా సోషల్ మీడియాలో లక్షలాదిమందికి టార్గెట్ అయ్యాడు.

ఇక‌ జర్నలిస్ట్ మూర్తి మాత్రం వైరల్ అయిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటూ వివరణ ఇచ్చారు. ఇద్దరిలో ఎవరిది తప్పు అనే ప్రశ్నకు.. ఇద్దరు వాదనలో వాస్త‌వం ఉంది అన్న‌ అభిప్రాయాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ మూర్తి పేరుతో ఎవరైనా కావాలని వేణు స్వామి దంపతులను బెదిరించి ఉండవచ్చని అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పోలీసులు ఇక వేణు స్వామి దంపతులు చెప్పేది నిజమే అయితే.. వారు పోలీసులకు కేసు పెడితే ఆరోపణలను సుమోటాగా తీసుకొని విచారణ చేసి.. వాస్తవాలను వెలుగులోకి తీసుకోవచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ.. వేణుస్వామి దంపతులు మాత్రం అలా చేయలేదు. జర్నలిస్టు మూర్తిని దగ్గర నుంచి చూసినవాళ్లు ఆయన డబ్బులు అసలు డిమాండ్ చేసే వ్యక్తి కాదంటూ చెబుతున్నారు.

రాజకీయ వర్గాల్లోనూ ఇదే మాట వినిపిస్తుంది. ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ ఆయనపై వినిపించలేదని.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక వేణు స్వామి పర్సనల్ లైఫ్ టార్గెట్ చేస్తూ వేణు స్వామి పై చాలా వ్యతిరేకత మొదలైంది. సోషల్ మీడియాలో ఆయనను మరింతగా ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇకపై అయినా వేణు స్వామి తన వ్యతిరేకతను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తారేమో వేచి చూడాలి. వేణు స్వామి వివేదాలకు దూరంగా ఉంటే అతని కెరీర్‌కు మంచిదని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జర్నలిస్టు మూర్తి వేణు స్వామి దంపతులు చేసిన ఆరోపణలను కించపరిచినట్లుగా భావించారని.. ఈ దంపతులపై పోలీసు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ కేసు విషయంలో ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.