ఫౌజీ సినిమాకు ఇమాన్వినే హీరోయిన్గా తీసుకోవడం వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా..?

హీరో, హీరోయిన్ల ఎంపికలు అనురాగపూడి ఎప్పుడు తనదైన వైవిధ్యత చూపిస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. అతడి హీరోయిన్ ఎంపిక ఎప్పుడూ ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదు. అలాంటి ఓ డైరెక్టర్.. ప్రభాస్ లాంటి పాన్‌ ఇండియన్ స్టార్ హీరో సరసన ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్గా సెలెక్ట్ చేస్తాడని ఎవరు గెస్ట్ కూడా చేసి ఉండరు. దీంతో ఈ అమ్మడు ఎవరు.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని ఆశ‌క్తి ప్రేక్షకుల్లో మొదలైంది.

ఇక ప్రభాస్‌కు జంటగా ఇమాన్వీనే హీరోయిన్గా తీసుకున్న హను రాఘవపూడి.. ఈసారి మాత్రం సెలక్షన్ తనది మాత్రమే కాదని.. వివరించాడు. సోషల్ మీడియాలో ఆమె వీడియోస్ చూసిన హను.. ఆ వీడియోలను నిర్మాతలకు, హీరో ప్రభాస్‌కు కూడా చూపించాన‌ని తర్వాత ఆమెకు కాల్ చేసి విషయం చెప్పి ఆమెను ఒప్పించాన‌ని చెప్పుకొచ్చాడు. అక్కడితో అయిపోలేదు.. ఆమెను హైదరాబాద్‌కు పిలిపించి ఆడిషన్స్ కూడా చేసి.. తర్వాత ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావించాన‌ని.. స్క్రిప్ టెస్ట్ చేసిన వీడియోస్ ప్రభాస్‌కు కూడా చూపించి.. అతను ఓకే అన్న తర్వాతే ఆమెను హీరోయిన్గా ఫిక్స్ చేసామని చెప్పుకొచ్చాడు.

అలా ఇమాన్వి ఇస్మాయిల్‌ను సెలెక్ట్ చేయడానికి ఏకంగా 15 రోజుల సమయం తీసుకున్నామని.. ఒకవేళ ఈ అమ్మ‌డికి ప్రభాస్ నో చెబితే.. ఆప్షన్ 2, ఆప్షన్ 3 కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఇమాన్వి మంచి డ్యాన్సర్ కాబట్టి ఆమెను తీసుకోలేదని.. ఆమె కళ్ళు మాట్లాడుతున్నట్లు అనిపిస్తాయని.. ఆమెలో ఉండే ఈ అంశమే నాకు బాగా నచ్చింది. అందుకే ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఢిల్లీలో పుట్టిన ఇమాన్వి లాస్ ఏంజెల్స్ లో తన చదువును పూర్తి చేసుకుంది. కొన్నాళ్లు జాబ్ చేసిన తరువాత తన ఉద్యోగానికి రిజైన్ చేసి ఫుల్ లెవెల్లో డ్యాన్సర్‌గా మారిపోయింది.