అలనాటి సౌత్ స్టార్ బ్యూటీ సంగీతకు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోను ఎన్నో సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఖడ్గం సినిమాల్లో పల్లెటూరు నుంచి తల్లితో కలిసి హైదరాబాద్‌కు హీరోయిన్ అవ్వాలని వచ్చి ఒక ఛాన్స్ కోసం అందర్నీ బతిమలాడుకుంటూ.. కన్నీళ్ళు సన్నివేశాల్లో జీవించేసింది. ఈ సినిమాలో అమ్మడి నటనను అసలు మర్చిపోలేరు. ఇక అలాంటి నేచురల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగీత.. ఒకప్పటి కథానాయకగా తెలుగులోనే కాదు తమిళ్, కన్నడం, మలయాళ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో నటించింది.
ఈమె గాయకుడు కృష్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఇక పెళ్లి తర్వాత కొన్ని సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగీత.. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తమిళ్ సినిమాలు కంటే తెలుగు సినిమాల్లో నటించడమే చాలా ఇష్టమని.. వివరించింది. కారణం తమిళ్ కంటే.. తెలుగులో ఎక్కువ గౌరవం ఉంటుందని.. తమిళ్ అభిమానులు ఆగ్రహించవచ్చు అయినా సరే తనకు తమిళంలో నటించడం కంటే తెలుగు సినిమా అంటేనే ఇష్టం అంటూ.. నిజమే చెబుతున్నానని వివరించింది. కోలీవుడ్‌లో నటించేటప్పుడు అక్కడ సరైన మర్యాద ఉండదని.. నిజం చెప్పాలంటే తమిళంలో తనెవరిని అవకాశాలు అడిగిందే లేదని వివరించింది.
ఎందుకంటే తెలుగులో తనకు మంచి సపోర్ట్ లభించిందని.. అంతేకాదు మంచి నిర్ణయం తో పాటు.. అవకాశాలు కూడా వస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఇక తమిళ్‌లో కొందరు అవకాశాల కోసం ఫోన్ చేసిన.. వాళ్లు అస్సలు మర్యాద లేకుండా మాట్లాడతారని.. వాళ్లే ఆ ఫోన్ చేసిన వారికి జీవితాలు ఇస్తున్నట్లు మాట్లాడతారని చెప్పుకొచ్చింది. తన రెమ్యూనరేషన్ కూడా వాళ్లే ఫిక్స్ చేసేస్తారని.. వచ్చి నటించేసి వెళ్ళండి అని చెప్తారని.. తనకు తమిళ్ సినీ ఇండస్ట్రీలో మర్యాద లేదని.. అందుకే తమిళ్ సినిమాలను ఎక్కువగా నటించడం లేదంటూ చెప్పుకొచ్చింది. ఈమె చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.