బ్లాక్ బస్టర్ సినిమా నుంచి మధ్యలో తప్పుకున్న నటులు వీళ్లే.. దురదృష్టం మామూలుగా లేదుగా..!

సినీ ఇండస్ట్రీలో ఏదైనా సినిమాను తెర‌కెక్కించాలంటే దానికి తగ్గట్లుగా డైరెక్టర్ కాస్టింగ్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తర్వాత కూడా వారు సరిగ్గా నటించకపోయినా.. టైమింగ్ సరిగా కుదరకపోయినా మరోసారి రేటెక్స్ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎన్ని సార్లు చెప్పినా నటులు.. డైరెక్టర్లకు కావాల్సినట్లు నటించక తప్పదు. ఒకవేళ అలా నటించలేక పోతే.. డైరెక్టర్ వారిని తీసేసిన సందర్భాలు కూడా ఉంటాయి. వారి స్థానంలో వేరొకరిని తీసుకొని దర్శకులు సినిమాను తెరకెక్కించడానికి అసలు వెనకాడరు. నిజానికి ఇప్పటివరకు ఇలాంటి సిచువేషన్ టాలీవుడ్ డైరెక్టర్లకు ఎన్నోసార్లు ఎదురయ్యాయి. ఆ సిచువేషన్స్ లో ఏదైనా కొంతమంది తెలుగు డైరెక్టర్లు, యాక్టర్స్‌ను మధ్యలోనే తొలగిస్తారు. వారి స్థానంలో వేరే సెలబ్రిటీస్ వచ్చి ఆ సినిమాలో నటించి క్రేజ్ అందుకుంటారు. అలా హిట్ సినిమాలలో నుంచి మధ్యలోనే తప్పుకున్న దురదృష్టవంతులు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.

Varsham | Cinema Chaat

వర్షం – విలన్ క్యారెక్టర్

రొమాంటిక్ యాక్షన్ ఫిలిం వర్షం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఓ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసిన ఆడియన్స్ అందరిలోనూ.. ప్రతి ఒక్క క్యారెక్టర్ అలా గుర్తుండి పోతుంది. ముఖ్యంగా భద్రన్న.. విలన్ రోల్ లో నేర్పించిన గోపీచంద్ క్యారెక్టర్ ను ప్రేక్షకులు అసలు మర్చిపోలేరు. అయితే మొదట ఈ క్యారెక్టర్ వేరొకరికి ఇచ్చారట. ఆ నటుడు సరిగ్గా నటించకపోవడంతో సినిమాలో నుంచి అతనిని తీసేసి డైరెక్టర్ శోభన్.. గోపీచంద్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇందులో గోపీచంద్ నటన ఎన్నో వేరియేషన్స్ తో ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాడు.

ఉప్పెన
వైష్ణవ్‌ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన మూవీలో.. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు డబ్బింగ్ మూవీ అయినా ఈ సినిమాకు.. మొదట బేబమ్మ (సంగీత) క్యారెక్టర్ లో యాక్టర్ మనీషా రాజ్‌ని హీరోయిన్ గా తీసుకున్నారట. అయితే ఆమె బేబమ్మ క్యారెక్టర్ కు సరిగ్గా సెట్ అవ్వదేమో అనే ఉద్దేశంతో బుచ్చిబాబు ఆమెను వద్దని చెప్పేసారట. దీంతో మరో డెబ్యూ యాక్టర్ అయినా దేవిక సంజయ్‌ని బుచ్చిబాబు సంప్రదించారని.. ఆమె కూడా ఆ పాత్రకు న్యాయం చేస్తుందని నమ్మకం బుచ్చిబాబుకు కలగలేదని తెలుస్తుంది. చివరకు మంగళూరుకు చెందిన కృతి శెట్టిని తీసుకుని ఈ సినిమాను తెర‌కెకించారు. ఇక ఈ ముద్దుగుమ్మ వైష్ణవ తేజ్ పక్కన ఫర్ఫెక్ట్గా సెట్ అవ్వడమే కాదు.. నటనతోను ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అమ్మోరు
హిందూ మైథాలాజికల్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన అమ్మోరు ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. కోడి రామకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో గోపాలకృష్ణ.. అలియాస్ గోరఖ్‌ పాత్రలో రామిరెడ్డి నటించి ప్రేక్షకులను భయపెట్టాడు. ఇది ఒక విలన్ పాత్ర అయినా.. ఈ పాత్రను ముందుగా రాత్రి మూవీ ఫేమ్ చిన్నాతో చేయించాలని అనుకున్నారట. సంవత్సరం పాటు షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రొడ్యూసర్ శ్యామ్‌ప్రసాద్ రెడ్డికి అవుట్ ఫుట్ అస్సలు నచ్చకపోవడంతో.. ఆయనను సినిమా నుంచి తప్పించి రామిరెడ్డిని విలన్ గా తీసుకున్నారు.