ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పెళ్లికూతురు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే క్రేజీ బ్యూటీ. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఈమె పుట్టింది బెంగళూరు అయినా.. పెరిగింది మొత్తం హైదరాబాద్ కావడం విశేషం. మొదటి మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. స్టార్ బ్యూటీగా మారింది. తెలుగులో పాటు తమిళ్ సినిమాల్లో హిట్ అందుకొని స్టార్ ఇమేజ్ తో దూసుకుపోయింది. ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ అమ్మడుకు సరైన అవకాశాలు లేకుండా పోయాయి. అందం, అభినయం ఉన్నా కూడా.. క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులు చేతిలో ఉన్నా కూడా.. అవి ముందుకు కదలని పరిస్థితి.
ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు.. ఈ అమ్మడి చేతిలో ఉన్న రెండు క్రేజీ ప్రాజెక్టులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆ రెండు భారీ ప్రాజెక్ట్‌లలో.. ఒకటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ మూవీ కాగా.. మరొకటి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కావడం విశేషం. ఈ రెండు సినిమాలు హిట్ అయితే.. ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయినట్లే అని అంత భావించారు. అయితే సినిమాలు ముందుకు కదలకపోవడంతో ఈ అమ్మడు ప్రస్తుతం డైలమాలో పడిపోయింది. ఇంతకీ ఈమె ఎవరో.. ఇప్పటికైనా అర్థమైందా. ఎస్ మీ గెస్ కరెక్టే. ఆమె నిధీ అగర్వాల్. తాజాగా ఆగస్టు 17న ఈ అమ్మడి పుట్టినరోజు సందర్భంగా ఈమెకు ఎంతోమంది సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజెన్లు పుట్టినరోజు విషెస్ తెలియజేశారు.
అంతేకాదు ఈ అమ్మడి చిన్ననాటి ఫొటోస్ కూడా నెటింట తెగ వైరల్ గా మారాయి. అందులోని ఓ ఫోటోనే ఈ చిన్నారి పెళ్లికూతురు నిధి అగర్వాల్. తెలుగు సినిమాల్లో కనిపించే దాదాపు రెండేళ్లు అయింది. ప్రస్తుతానికి హరిహర వీరమల్లు సినిమాతో పాటు.. ప్రభాస్ జంటగా ది రాజాసాబ్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా రాజాసాబ్ సినిమా సెట్స్‌పైకి వచ్చి షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 2025 వేసవి సెలవుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ క్రమంలో రాజాసాబ్ మూవీ సెట్స్‌లో నిధి అగర్వాల్ బర్త్డే గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేశారు మేకర్స్. డైరెక్టర్ మారుతి తో పాటు.. ఎంతో మంది యూనిట్ సభ్యులు సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు.