యంగ్ రెబల్ స్టార్‌గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్.. ప్రస్తుతం తన స్థాయిని విస్తరించుకుని బిజీగా గడుపుతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన ఈయన.. నేషనల్ లెవెల్లో ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇటీవల కల్కి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. వేయికోట్ల పైన కలెక్షన్ రాబట్టిన ఈ సినిమా ప్రభాస్ తో పాటు.. బాహుబలి తర్వాత ఒక మూవీ కూడా వెయ్యి కోట్లు కలెక్షన్ చేయలేదంటూ నిరుత్సాహపడుతున్న అభిమానుల్లోను ఫుల్ జోష్ నింపింది. ఇక ప్రస్తుతం ప్రభాస్.. మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు ఈ సినిమాను స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటివరకు ఈ సినిమా పూర్తికాలేదు.
ఈ క్రమంలో రాజాసాబ్ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ తనను తానే దిష్టి తీసుకుంటూ కనిపిస్తాడు. దీన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ సినిమాల ప్రభాస్ యాంగ్ లుక్‌లో తనను తాను ప్రేమించుకునే వ్యక్తిగా కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమాను కమర్షియల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాను మారుతి సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడట. అందులో భాగంగానే ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోని ప్రాజెక్టుకు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుందంటే పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు ఎలాంటి ఆసక్తి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక రాజాసాబ్ ఇప్పటివరకు ప్రభాస్ నటించిన సినిమాల కంటే చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఒకప్పుడు ఆయన చేసిన మిర్చి, డార్లింగ్ లాంటి పాత ప్రభాస్‌ను ఈ సినిమాలో మరోసారి చూడవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి రీసెంట్ గా ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ కూడా మాస్ సెలబ్రేషన్స్, కమర్షియల్ ఎలివేన్స్ అంత పెద్దగా చూపించలేదు. కనుక ఈ సినిమాలో అన్నింటిని మిక్స్ చేసి మన ముందుకు తీసుకురాబోతున్నాడట మారుతి. అయితే ఈ గ్లింప్స్‌లో మారుతి ప్రభాస్‌ను తనకు తానే దిష్టి తీసుకున్నట్లుగా చూపించడం కంటే.. ఇంకేదైనా కొత్తగా డిఫరెంట్‌గా ట్రై చేసి ఉంటే బాగుండేది అంటూ సినీ మేధావులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ట్రైలర్లో ఒక్క డైలాగ్ కూడా చెప్పకపోవడం ఫాన్స్ ను హాట్ చేస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మారుతి గ్లింప్స్ రిలీజ్ విషయంలో ఈ తప్పులు చేయకుండా ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.