మెగా ఫ్యాన్స్‌కు పూనకాల అప్డేట్.. చిరు, పవన్, చరణ్‌తో మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్‌ శంకర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్.. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.

 

మెగా హీరోలతో ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ తీయాలని ఉందని వివ‌రించాడు. హరిష్ శంకర్‌కు మీరు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారా అనే ప్రశ్న ఎదురుకాగా.. ఏదో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసేయాలని ఉద్దేశంతో నేను సినిమాలు తీయను అది సహజంగా జరిగిపోవాలంటూ వివరించాడు. పాకిస్తాన్ బోర్డర్‌లో జరిగే లవ్ స్టోరీగా ఒక కథను రాశానని.. అది కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందంటూ వివరించాడు. అలాగే పవన్, చరణ్, చిరు లతో ఓ సబ్జెక్టు పై పనిచేస్తున్నానని చెప్పుకోవచ్చాడు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాల్లోనే అతిపెద్ద పాన్ ఇండియన్ సినిమాగా ఇది ఉండబోతుంది అంటూ చెప్పడం విశేషం.

ఒకవేళ ఈ సినిమా కానీ తెర‌కెక్కిస్తే అది ఖచ్చితంగా అన్ని సినిమాలను మించిపోయి పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటుంది. కాగా సినిమాను మనం ప్లాన్ చేసుకోకూడదు. సహజంగా జరిగిపోవాలి అంటూ చెప్పుకొచ్చాడు. మొదట పుష్ప, కాంతారా కూడా పాన్ ఇండియా సినిమాలుగా తీయాలని అనుకోలేదని.. అలాగే ఆర్‌ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వస్తుందని ఎవరు భావించలేదని.. అలా ఏ సినిమా అయినా న్యాచుర‌ల్‌గా జరిగిపోవాలంటూ చెప్పుకొచ్చాడు. ఇక తన సినిమా కథల గురించి ముందుగానే చెప్పడం ఆయనకు ఇష్టం లేదంటూ.. హరీష్ శంకర్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబో వీలయినంత త్వరగా సెట్స్ పైకి వస్తే బాగుండదు ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.