చిరు వద్దని మొత్తుకున్న పవన్ చేసిన సినిమా .. రిజల్ట్ తెలిస్తే దండం పెడ‌తాం..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ సినిమాలతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న బాండింగ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు. ఇక పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవిని.. తండ్రిలా భావిస్తూ ఆయన మాటలు ఎంతగానో గౌరవిస్తూ ఉంటాడు. ఇక తను నటించే సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే పవన్ కళ్యాణ్.. అన్నయ్య చిరంజీవి సూచనలను కూడా వింటూ ఉంటాడు. అంతలా తన అన్నను గౌరవించే పవర్ స్టార్.. ఓ సినిమా విషయంలో మాత్రం చిరంజీవి ఎంత వద్దని మొత్తుకున్నా సరే వినకుండా సినిమాలు చేశాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తానే హీరోగా పవన్ కళ్యాణ్ నటించిన మూవీ జానీ. అయితే ఈ సినిమాను స్టార్ట్ చేస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్.. చిరంజీవికి కథ వినిపించారట. స్టోరీ చాలా బాగుంది.. అయితే వేరే డైరెక్టర్ డైరెక్షన్ లో నువ్వు హీరోగా చేస్తే సినిమా వర్కౌట్ అవుతుంది.. నువ్వే డైరెక్ట్ చేస్తూ.. నువ్వే యాక్టింగ్ అంటే అది సాధ్యం కాదు అని చిరంజీవి.. పవన్ కళ్యాణ్ కు వివరించాడట. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఒక్క విషయంలో చిరు మట వినకుండా ప‌వ‌న్ ఈ సినిమా కథను నేనే డైరెక్ట్ చేయాలని రాసుకున్న అంటూ వివరించాడట. అలా చిరంజీవి వద్దన్నా వినకుండా పవన్ కళ్యాణ్ తన సొంత డైరెక్షన్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు. కానీ రిజల్ట్ మాత్రం చిరు చెప్పినట్టే జరిగింది.

Watch Johnny (Telugu) Full Movie Online | Sun NXT

దీంతో చిరంజీవి చెప్పిన మాటను విని వేరే డైరెక్టర్ సినిమా చేసి ఉంటే మంచి సక్సెస్ అయి ఉండేదేమో అని.. అయితే తానే డైరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అలాంటి సాహ‌సం చేశానంటూ పవన్ కళ్యాణ్ స్వయంగా పలు సందర్భాల్లో వివరించాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో తన డైరెక్షన్‌లో తానే హీరోగా చేసి ఫ్లాప్‌ను ఎదుర్కోవడం అప్పట్లో పవన్ అభిమానులకు కాస్త నిరాశపరిచింది. అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో మంది జానీ సినిమాను ఇష్టపడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ పక్కన సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్కన పాలిటిక్స్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం గా పగ్గాలు పుచ్చుకున్న పవన్ కళ్యాణ్.. పొలిటికల్‌గా రాణిస్తూనే.. వీలు దొరికినప్పుడల్లా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.