మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గేమ్ చెంజర్ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హడావిడి పూర్తి కాగానే బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో చరణ్ తన 16వ సినిమా చేయనున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. ఆర్‌సీ 16 లో రామ్ చరణ్ తల్లిగా ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ నటిస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఆమె మరెవరో కాదు లెజెండ్రస్ యాక్టర్, పవర్ఫుల్ లేడీ విజయశాంతి. ఈ సినిమాలో చరణ్ కు తల్లిగా నటించనుందని టాక్. అందులో నిజం ఎంతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తల్లి పాత్ర చాలా కీలకమైందని.. ఇందులో ఓ పవర్ఫుల్ లేడీని తీసుకోవాలని ఉద్దేశంతో టీం విజయశాంతి అయితే ఈ క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గా ఉంటుందని భావించారట. ఇక విజయశాంతి గతంలో చిరంజీవితో కలిసి నటించి ఎన్నో సినిమాలతో హిట్టేందుకున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి క్రమంలో విజయశాంతి.. రామ్ చరణ్ సినిమాలో నటిస్తుందంటూ.. సినిమాపై మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి హైప్ నెలకొంటుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజియస్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక గేమ్ చెంజర్ సినిమా పూర్తి అయిన వెంటనే.. ఈ సినిమాను మొదలుపెట్టి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నారట టీం. చరణ్ కూడా ఇదే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.