పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘ కల్కి 2898 AD ‘ మూవీ గురించి అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులతో పాటు సినీ లవర్స్ అంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మూవీ టీం కూడా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇక తాజాగా ముంబైలో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేకంగా ఓ పవర్ఫుల్ ట్రైలర్ ప్లే చేశారు. అదే రిలీజ్ ట్రైలర్ను ఇప్పుడు రెండు రోజుల తర్వాత తెలుగు ఆడియన్స్ కోసం నెటింట విడుదల చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్లో విద్వాంసాన్ని సృష్టించింది.
సినిమాపై ప్రేక్షకుల్లో ఫుల్ హైప్ క్రియేట్ అయింది. ఇక కల్కి కోసం థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు అవగాహన ఉంటే బాగుంటుందని మూవీ టీమ్ అంతా.. మొదటినుంచి దీనిపై కొన్ని ఆసక్తికర విషయాలను వివరిస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ ఫైనల్ వార్ ట్రైలర్ తో మరింత క్లారిటీ వచ్చేసింది. కల్కి సినిమా కథ ఎలా ఉండబోతుంది అనే విషయం ఇప్పటికే అభిమానులకు, ప్రేక్షకుల్లో ఓ స్పష్టత వచ్చేసింది. అయితే ఈ కథ ఎంత బాగా తెరకెక్కించారు అనేది తెలియాలంటే మాత్రం వెండి తెరపై సినిమా వచ్చేవరకు వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే సినిమా సెన్సార్ పూర్తిచేసుకుని.. సెన్సార్ వాళ్ళు ఇచ్చిన రివ్యూతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కల్కి 2898 ఏడీ రిలీజ్ ట్రైలర్ తో మరిన్ని విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మేకర్స్.
ముఖ్యంగా అశ్వద్ధామ, కల్కి మధ్య జరిగే యుద్ధం ఎలా ఉండబోతుంది అనే దానిపై క్లారిటీ వచ్చింది. సినిమా మూడు ప్రపంచాలను కనెక్ట్ చేస్తూ ఉంటుందని ఇప్పటికే హింట్ ఇచ్చాడు నాగ అశ్విని. ఈ ట్రైలర్ లో వాటి గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికే చాలా అప్డేట్స్ వచ్చిన ఈ సినిమాలో అంతకు మించిన ట్విస్టులు మరిన్ని దాచి ఉంచారంటూ.. ముఖ్యంగా క్యామియో అపీరియన్సిల్ గా ఎంతో మంది సెలబ్రిటీస్ ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి తగ్గట్టే సినిమాను గట్టిగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక మేకర్స్ చెప్పిన మాటలు, ఇస్తున్న అప్డేట్స్ చూస్తుంటే ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి పెరిగింది. బొమ్మ బ్లాక్ బాస్టర్ పక్క అని నమ్మకం ప్రభాస్ అభిమానుల్లో ఏర్పడింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయి ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలంటే జూన్ 27 వరకు వేచి చూడాల్సిందే.