ఆ స్టార్ హీరో నన్ను ఒంటరిగా అక్కడికి రమ్మని బలవంతం చేశాడు.. నాగార్జున హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్.. ?!

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటినుంచో ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా పలువురు నటి మణులతో పాటు కొంతమంది హీరోయిన్స్ కూడా కాస్టింగ్ కౌచ్ విషయంలో తమకు జరిగిన అనుభవాలను షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది నటీమణులు తమ క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలతో పాటు.. వారు ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారో ఆ హీరోలు, డైరెక్టర్ల పేర్లను కూడా వెల్లడించారు. కొంతమంది పేర్లు చెప్పకుండానే ఫలానా స్టార్ హీరో నన్ను ఇలా చేశారంటూ క్యాస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇక తాజాగా ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ 23 ఏళ్ల వయసులో తనకు జరిగిన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఓ స్టార్ హీరో వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఆమె ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటో ప్రేక్షకులతో షేర్ చేసుకుంది.

Nagarjuna Trying To Kiss Isha Koppikar || Chandralekha Movie - YouTube

ఆమె ఎవరో కాదు ఈషా కొపికర్. ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు రాకపోవచ్చు.. కానీ నాగార్జున నటించిన చంద్రలేఖ మూవీ హీరోయిన్ అనగానే ఇట్టే గుర్తుకొస్తుంది. ఇక అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్ముడు.. పలు సినిమాల్లో నటిస్తూ స్టార్ బ్యూటీగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తెలుగు, తమిళ, కన్నడ తో పాటు హిందీ భాషల్లోను ప‌లు సినిమాలో నటించింది. ప్రస్తుతం 47 ఏళ్ళ వయసున్న ఈ అమ్మడు తెలుగు సినిమా తోనే తన కెరీర్ ప్రారంభించింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దగ్గర పడుతున్నా.. ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో నాగార్జున చంద్రలేఖ సినిమా తరువాత.. వెంకటేష్ తో ప్రేమతో రా సినిమాలోను నటించి మెప్పించింది. ఇటీవల కాలంలో నిఖిల్ హీరోగా బ‌చ్చిన‌ కేశవ సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో మెప్పించింది.

Isha Koppikar Sent Birthday Wishes to the Superstar Who Allegedly  Misbehaved with Her - Masala

ఇక ఇటీవల ఇంటర్వ్యూలో సందడి చేసిన ఈషా కొపికర్ తను ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తర్వాత ఎదుర్కొన్న క్యాస్టింగ్ అనుభవాలను గురించి చెప్పుకొచ్చింది. బాలీవుడ్ చీకటి కోణాన్ని.. తను యంగ్‌గా ఉన్నప్పుడు ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను వివరించింది. ఆమె త‌న 18 ఏళ్ళ వ‌య‌స్సులోనే ఇండ‌స్ట్రీకి అడుగుపెట్టిన‌ట్లు చెప్పుకొచ్చింది. అలా నా వయసు 22, 23 ఏళ్లు ఉన్న సమయంలో నేను బాలీవుడ్ సినిమాలను నటించడం మొదలు పెట్టా.. ఆ సమయంలో ఓ స్టార్ హీరో నన్ను సంప్రదించి ఏకాంతంగా కలవాలని.. నాతోపాటు నా డ్రైవర్ కూడా ఉండకూడదు అంటూ పట్టుపట్టాడు. కానీ అతని గురించి అప్పటికే నాకు కొన్ని విషయాలు తెలిశాయి. దీంతో అతని దగ్గరకు వెళ్లడానికి నేను ఇష్టపడలేదు.. వెళ్లి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో నేను ఊహించా అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.