వాట్.. వెంకీ మామ నటించిన ఆ సినిమాలో 5 నిమిషాల సీన్ కోసం 5 నెలల షూటింగ్ చేశారా.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..?!

టాలీవుడ్ లో పలు సినిమాలు ఎవర్గ్రీన్ హిట్లుగా నిలిచిపోతూ ఉంటాయి. ఏళ్లు గడిచినా కూడా ఆ సినిమాలు బుల్లితెరపై వస్తున్నాయంటే టీవీలకు అతుక్కుపోతుంటారు అభిమానులు. ఎంత చూసినా అలా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాల్లో వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఒకటి. ఆర్తి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో బ్రహ్మానందం, సునీల్, ప్రకాష్ రాజ్, ఎమ్ఎస్ నారాయణ కీలకపాత్రలో మెప్పించారు. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు బ్రేక్ చేసింది. దాదాపు ఈ మూవీ వచ్చి 24 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ మూవీ వస్తుందంటే చాలామంది టీవీలకు అతుక్కుపోతారు.

Nuvvu Naaku Nachchav (2001) - IMDb

అంతలా ఆదరించి ఆకట్టుకున్న ఈ సినిమాలో కేవలం ఒక్క ఐదు నిమిషాల సీన్ కు ఏకంగా ఐదు నెలల టైం పట్టిందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ డైరెక్టర్ విజయభాస్కర్ వివరించాడు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ అమ్మ గురించి గుర్తు చేసుకుంటూ లెటర్ చదివే సీన్ ఉంటుందని.. అప్పుడు దాదాపు సీన్ లో మెయిన్ పాత్రలు అన్నీ ఉంటాయి.. దీంతో అందరూ యాక్టర్స్ ను ఒకేసారి తీసుకురావడం చాలా కష్టమైంది అంటూ వివరించాడు. ఆ సీన్ షూట్ చేసే టైంలో ఆర్తి అగర్వాల్ మరో సినిమా కోసం యుఎస్ కు వెళ్లారని.. అలాగే వెంకటేష్ వేరే షూట్లో బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చాడు.

Trivikram Srinivas Dialogues: TRIVIKRAM DIALOGUE IN NUVVU NAKU NACHHAV PART1

ఇలా సునీల్, ప్రకాష్ రాజ్ వీళ్లంతా కూడా బిజీగా ఉండడంతో.. అందుబాటులో ఉన్న ఒక్కొక్క యాక్టర్‌తో ఒక్కొక్కసారి ఇండివిడ్యువల్గా సీన్‌ తీసి అందరినీ సన్నివేశంలో రీ క్రియేట్ చేసి ఈ సీను చూపించాము.. అలా మొత్తం సీన్ పూర్తయ్యేసరికి ఐదు నెలల వరకు టైం పట్టింది అంటూ వివరించాడు డైరెక్టర్ విజయభాస్కర్. అయితే ఈ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేశ్తారు. ఎంతో కామెడీగా తెర‌కెక్కిన ఈ సీన్ ఇప్పటికీ ప్రేక్షకల్లో గుర్తుండిపోయింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. రాజమౌళిని మించిపోయి మరి దర్శకుడు పర్ఫెక్ట్ గా సన్నివేశాన్ని చిత్రీకరించాడే అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.