వాట్.. చిరంజీవి కారణంగా హీరోయిన్ ఆమని అంత వేదనకు గురైందా.. ఇప్పటికీ ఆ మ్యాటర్ గుర్తొస్తే చాలా భాధ‌గా అనిపిస్తుందంటూ..?!

90లో స్టార్ హీరోయిన్గా రాణించిన వారిలో కన్నడ బ్యూటీ ఆమని ఒకటి. న‌ట‌న‌ పరంగా సహజ నటిగా క్రేజ్‌ సంపాదించుకున్న ఆమని.. జంబలకడిపంబ, మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోయింది. బాలకృష్ణ, నాగార్జునతో ఒకటి రెండు సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో మాత్రం నటించే అవకాశం అమ్మడుకు రాలేదట. అయితే చిరంజీవి పక్కన ఆమెకు నటించే ఛాన్స్ ఒకసారి వచ్చినా అది మిస్ అయిందని వివరించింది. డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి తెర‌కెక్కించిన శుభలగ్నం ఎలాంటి సక్సెస్ అందుకున్న అందరికీ తెలుసు. హీరోయిన్ డబ్బు కోసం మొగుడిని అమ్ముకోవడం అనే కాన్సెప్ట్ గతంలో ఎప్పుడు రాక పోవ‌డంతో అలాంటి పాయింట్ ప్రధానంగా తీసుకుని ఎస్ వి కృష్ణారెడ్డి ప్రయోగాత్మకంగా సినిమా తెర‌కెక్కించారు.

భర్తతో విడాకుల గురించి ఆమని క్లారిటీ ఇదే.. ఆ రీజన్ వల్లే విడిపోవాల్సి  వచ్చిందంటూ

కామెడీ, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో జగపతిబాబు, ఆమని తో పాటు రోజా ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ సక్సెస్ సాధించడానికి ఆమని ప్రధాన పాత్ర పోషించింది. ఈ క్రమంలో చిరంజీవి హీరోగా న‌టించిన‌ రిక్షావోడు సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే చిరంజీవిని ఆరాధించే ఆమె ఆయన పక్క హీరోయిన్గా ఛాన్స్ అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకున్నానని.. డేట్స్ కూడా ఇచ్చేసానని.. చిరంజీవి గారికి ఫోన్ చేసి మాట్లాడాన‌ని వివరించింది. అయితే త్వరలోనే షూటింగ్‌లో కలుద్దామని ఆయన చెప్పార‌ని.. కొద్ది రోజుల తర్వాత రిక్షావోడు సినిమాలో నగ్మా హీరోయిన్ అంటూ పేపర్లో వార్త వచ్చిందని.. నా స్థానంలో నగ్మా అంటున్నారేంటి అని మేనేజర్‌ని ప్రశ్నించానని.. డైరెక్టర్ మారారు కోదండరామిరెడ్డి బదులు కోడి రామకృష్ణ ఈ సినిమా డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు అని చెప్పాడంటూ వివ‌రించింది.

Rikshavodu Songs Download SouthMp3.Org

అందుకే హీరోయిన్ మార్చేశారు మేడం అని అతను అన‌డంతో నేను తీవ్ర నిరాశకు గురయ్యానంటూ వివరించింది. మళ్లీ కొన్నాళ్ల తర్వాత చిరంజీవి సిస్టర్ రోల్ లో నటించే అవకాశం వచ్చిందని.. పదిసార్లు అడిగినా సిస్టర్ రోల్ చేయండి తెగేసి చెప్పానంటూ చెప్పుకొచ్చింది. చిరంజీవి పక్కన ఛాన్స్ మిస్ అయ్యానని గుర్తుకు వస్తే ఇప్పటికీ బాధగా అనిపిస్తుందని.. అప్పట్లో అయితే ఏడ్చేసేదాన్ని అంటూ వివరించింది. స్టాలిన్ సినిమాల్లో కుష్బూ నటించిన సిస్టర్ రోల్ ఆమని కి మొదట అవకాశం వచ్చిందని.. తన డ్రీమ్ హీరోకు సిస్టర్ గా నటించడం ఇష్టం లేక ఆ పాత్రను రిజెక్ట్ చేసానంటూ వివరించింది. అయితే ఆయనతో సినిమాలో నటించకపోయినా ఓ సందర్భంలో ఫోటో దిగే అవకాశం వచ్చిందంటూ చెప్పుకొచ్చింది.