ఎలాంటి డ్యాన్స్ స్టెప్స్ అయినా చించిపడేసే సాయి పల్లవి.. ఆ స్టార్ హీరో వేసిన ఒక్క స్టెప్ మాత్రం ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉందా..?!

టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. అందం అవినయంతో పాటు తెలంగాణ యాసతో అదరగొట్టిన ఈ బ్యూటీ తన నటించిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. కథలో కంటెంట్ ఉంటేనే తప్ప ఎలాంటి స్టార్ హీరో సినిమాలైనా రిజెక్ట్ చేస్తూ ఆచితూచి క‌థ‌ల‌ను ఎంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

Sai Pallavi Fan ❤️ on X: "Dancing Queen 💃💃 @Sai_Pallavi92 #SaiPallavi  #LoveStoryOnApril16th #LoveStory #EvoEvoKalale https://t.co/sKjRmf3U7I" / X

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా.. లేడీ పవర్ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకుంటున్న సాయి పల్లవి.. రెమ్యునరేషన్ విషయంలోనూ చాలా లిమిటెడ్ గా ఉంటూ నిర్మాతలకు సహకరిస్తుంది. ఇక అమ్మ‌డి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి టఫ్ స్టెప్స్ అయినా ఇట్టే పట్టేసి అదరగొట్టే ఈ అమ్మడు.. ఓ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాల్లో చేసిన డ్యాన్స్ స్టెప్పులు మాత్రం ఎన్నిసార్లు ప్రయత్నించిన ఫెయిల్ అయిందంటూ నెటింట ఓ వార్త‌ వైరల్ గా మారింది.

Mutha Mestri step

గతంలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సాయి పల్లవి ఈ విషయాన్ని స్వయంగా వివరించింది. ఆమె ఎన్నోడ్యాన్స్ స్టెప్స్ శుల‌శంగా వేశాన‌ని.. కానీ మెగాస్టార్ గారి డ్యాన్స్ స్టెప్స్ వేయడం చాలా కష్టం అంటూ వివరించింది. ఆయన ముఠా మేస్త్రి సినిమాలో వేసిన హాయ్ రబ్బ హాయ్ రబ్బ హాయ్ సాంగ్ లోని స్టైలిష్ డ్యాన్స్ స్టెప్ మాత్రం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయనలా చేయలేకపోయాను అంటూ వివరించింది. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మా మెగ స్టెప్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ మెగా స్టార్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.