టాలీవుడ్ మాటలమంత్రికుడు త్రివిక్రమ్.. స్టార్ డైరెక్టర్ గా ఎలాంటి ఇమేజ్స్ తో దూసుకుపోతున్నాడో తెలిసిందే. ఈ క్రమంలోనే చివరగా గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఆయన.. గత ఏడాదిన్నరగా ఎలాంటి సినిమాలు తీయకుండా ఖాళీగానే గడుపుతున్నాడు. కాగా అల్లు అర్జున్ కోసం ఇప్పటికే ఓ మైథిలాజికల్ కథని సిద్ధం చేశాడు త్రివిక్రమ్. ఇక త్వరలోనే సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది అనుకునే టయానికి బన్నీ లైన్ మార్చేసాడు. పుష్ప 2 తర్వాత.. త్రివిక్రమ్‌ను కాదని.. అట్లీతో సినిమా చేసేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో త్రివిక్రమ్‌కు ఎదురుచూపులు తప్పడం లేదు. అలానే.. ఎవరితో సినిమా చేయాలని పూర్తిగా కన్ఫ్యూజన్లో మునిగిపోయిన ఆయన.. ప్రస్తుతం సరికొత్త ఆలోచనలో ఉన్నాడట.
బన్నీ ప్లేస్ లో ఆ ప్రాజెక్టులోకి మరో టాలీవుడ్ తోప్ హీరోను రప్పిస్తున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అతనెవరో కాదు తారక్. ఎస్.. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కోసం రెడీ చేసిన కథను ఇప్పుడు ఎన్టీఆర్ తో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడట. అలా అని ఈ ప్రాజెక్టు ఇప్పుడే మొదలవుతుందా అంటే కాదనే చెప్పాలి. కారణం త్రివిక్రమ్.. చరణ్, వెంకటేష్ లతో వరుసగా సినిమాలు చేయనున్నాడు. ఇవి పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ తో సినిమా ఉండొచ్చని చెప్తున్నారు. ఇంతలో ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటారని సమాచారం. అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్, తారక్ కాంబోలో మరో సినిమా వస్తుందని కొనేళ్ళ క్రితం అఫీషియల్ ప్రకటన వచ్చినా.. ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.
ఇక అదే కథ.. త్రివిక్రమ్, మహేష్‌తో గుంటూరు కారం గా తీసారని సోషల్ మీడియాలో అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ ఓ స్టార్ హీరోతో సినిమా అని.. మరో స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడట. అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం అట్లీ సినిమాలో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఒకవేళ కుదిరితే త్రివిక్రమ్‌తో ఈ ప్రాజెక్టు ఉంటుంది. లేదంటే మాత్రం.. సందీప్ రెడ్డివంగా ప్రాజెక్ట్, అలాగే పుష్ప 3 మూవీ.. లైనప్‌లో ఉండనే ఉన్నాయి. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ సినిమాను.. బన్నీ మిస్ చేసుకున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. ఇక త్వరలోనే త్రివిక్రమ్ – రామ్ చరణ్ మూవీ గురించి అఫీషియల్ గా ప్రకటన రానుందట.