టాలీవుడ్ స్టార్ సింగర్ మంగ్లీ గురించి ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తాజాగా.. ఈ అమ్మడి బర్త్డే సెలబ్రేషన్స్ వివాదానికి దారి తీసింది. చేవెళ్లలోని.. త్రిపుర రిసార్ట్స్‌లో మంగ్లీ బర్త్డే సెలబ్రేషన్స్.. గ్రాండ్ లెవెల్లో జరిగాయి. ఈ వేడుకల్లో గంజాయి సప్లై జరుగుతున్నట్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందటంతో.. రిసార్ట్‌లో ఆకస్మిక దాడులు చేపట్టారు పోలీసులు. ఈ దాడుల్లో భారీగా గంజాయి, ఫారన్ లిక్కర్ స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అంతేకాదు.. ఈ పార్టీలో సందడి చేసిన పలువురికి మెడికల్ టెస్ట్లు నిర్వహించగా.. డ్రగ్స్ పాజిటివ్గా తేలడంతో.. ఇది మరింత దుమారంగా మారింది.
అసలు మేటర్ ఏంటంటే.. చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు నిన్న( మంగళ వారం) రాత్రి గ్రాండ్ లెవెల్లో జరిగాయి. పార్టీకి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు.. పలువురు యూత్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పార్టీలో డ్రగ్స్ ఉపయోగిస్తున్నారని.. పోలీసులకు అందిన సమాచారంతో వెంటనే రిసార్ట్ పై దాడులు చేపట్టారు. ఈ సోదాలో భారీ మొత్తంలో గంజాయి.. అలాగే ఫారెన్ లిక్కర్ సీసాలు దొరికాయి.
పార్టీలో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడికల్ టెస్ట్ లో నిర్వహించగా.. అ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. డ్రగ్స్ వినియోగించిన వాళ్ళల్లో పలువురు స్టార్ సెలబ్రిటీల కిడ్స్ సైతం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో.. ముఖ్యంగా యూత్ లో ఈ డ్రగ్స్ వాడకంపై ఆందోళన మొదలైంది. కాగా.. ఈ మేర కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దానిపై లోతైన దర్యాప్తు చేపట్టారు. పార్టీ నిర్వాహకులు పాత్ర పైన.. అసలు ఈ మాదక ద్రవ్యలా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో.. తెలుసుకునే దిశగా లోతైన దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటన ముందు ముందు మరెని మలుపులు తిరుగుతుందో చూడాలి.