టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు.. ఏ.ఎస్ రవికుమార్ చౌదరి మృతి చెందడం టాలీవుడ్ ఇండస్ట్రీని విషాదంలో నింపింది. గత రాత్రి జూన్ 10న కార్డియాకారెస్ట్ కారణంగా ఆయన హఠాత్ మరణం చెందినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్న ఏ. ఎస్. రవికుమార్ చౌదరి.. ఆయన తెరకెక్కించిన చివరి సినిమాలు వరుసగా పరాజయాలు కావడంతో.. మానసిక ఒత్తిడికి గురయ్యారని తెలుస్తుంది. మరోవైపు ఇండస్ట్రీలో సన్నిహితులు దూరం కావడం కూడా.. ఆయనపై మరింత ప్రభావం చూపిందట. ఈ క్రమంలోనే రవికుమార్ డిప్రెషన్‌కులోనై మధ్యానికి బానిస అయ్యాడని.. దీంతో అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.
ఇక రవికుమార్ చౌదరి తన సినీ కెరీర్‌లో గాడ్ ఆఫ్ మాసేస్ బాలయ్యతో పాటు, గోపిచంద్, యంగ్ హీరోలు నితిన్, సాయి దుర్గ తేజ్, రాజ్ తరుణ్ లాంటి కుర్ర హీరోలతో సైతం సినిమాలను తెరకెక్కించాడు. గోపీచంద్ హీరోగా.. ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ పై పోకూరి బాబురావు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన యజ్ఞం సినిమాతో డైరెక్టర్గా తన సినీ కెరీర్ ప్రారంభించిన రవికుమార్ చౌదరి.. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్నాడు. దీంతో బాలయ్యతో మూవీ ఛాన్స్ కొట్టేశాడు. అలా వీరభద్ర సినిమాను తెరకెక్కించగా.. ఈ సినిమా ఊహించిన రిజల్ట్ అందుకోలేకపోయింది. తర్వాత.. నితిన్ హీరోగా రూపొందిన ఆటాడిస్తా సినిమా డిజాస్టర్ అయింది.
అయితే.. కొంతకాలం గ్యాప్ తర్వాత.. మరోసారి సినిమా అవకాశాన్ని దక్కించుకొని ఏం పిల్లో.. ఏం పిల్లడో.. సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం.. ఆయనకు కాస్త ఊరటనిచ్చింది. సుప్రీం స్టార్.. మెగా హీరో.. సాయి ధరంతేజ్ హీరోగా.. పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో భారీ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత తన ఫస్ట్ మూవీ హీరో గోపీచంద్‌తో సౌఖ్యం సినిమాను రూపొందించాడు. అయితే.. ఈ సినిమా సరైన రిజల్ట్ ను అందుకోలేకపోయింది. ఇక.. తాజాగా రాజ్ తరుణ్ హీరోగా తిరగబడురా స్వామి సినిమాతో.. రవికుమార్ మరోసారి ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో సినిమాలకు దూరమైన ఆయన.. మెల్లమెల్లగా మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడని సన్నిహితులు చెబుతున్నారు.