టాలీవుడ్ లెక్కల మాస్టారు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సక్సస్ ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సుకుమార్.. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా మరో సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడట. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం.. నాన్ బాహుబలి రికార్డ్‌లను సైతం బ్లాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరి కాంబో సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సుకుమార్ టాలీవుడ్‌కు చెక్ పెట్టేసి బాలీవుడ్ చెక్కేయనున్నాడట. అక్కడ ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు అంటూ సమాచారం.
ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ బాద్‌ష షారుఖ్ ఖాన్. ఎస్.. సుకుమార్, షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందంటూ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. పుష్ప, పుష్ప 2 లాంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్‌తో కలిసి ఈ సినిమా చేసేందుకు షారుఖ్ ఖాన్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరి కాంబోలో పొలిటికల్ యాక్షన్ డ్రామా రూపొందనుందని తెలుస్తోంది. ఇక తాజాగా షారుక్.. సుకుమార్ కలవడంతో ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్లయింది. అంతేకాదు.. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందించనున్నారని.. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నట్లు టాక్.
ఈ బడ్జెట్‌లో మూవీకి సుకుమార్ రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువగానే ఉండని తెలుస్తుంది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం.. ఇక సుకుమార్ టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసి.. బాలీవుడ్‌లోనే సెటిల్ అవుతాడంటూ టాక్ నడుస్తుంది. అయితే.. ఇంకా షారుక్‌తో సినిమా ఫైనల్ అవ్వలేదు. ఈ సినిమా ఫుల్ లెవెల్‌లో ఫైనలైజ్ కావడానికి మరో రెండేళ్లు సమయం పడుతుందని.. అప్పటివరకు వీళ్ళిద్దరిలో ఎవరు కొత్త ప్రాజెక్టులు సైన్ చేయకపోతే.. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందంటూ తెలుస్తుంది. ఏదేమైనా.. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్మెంట్ వస్తే మాత్రం.. ఆడియన్స్‌లో సినిమాపై పిక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొంటాయి అనడంలో సందేహం లేదు. అయితే.. ఈ కాంబో విషయంలో వస్తున్న వార్తల పై సుకుమార్ ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాలి.