” కుబేర ” మూవీ సెన్సార్ రివ్యూ.. భారం అంతా నాగ్, ధనుష్ లపైనే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. అక్కినేని కింగ్ నాగార్జున కీలకపాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాల్లో రష్మిక మందన హీరోయిన్గా మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో రావడానికి మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి క్రమంలో డిఎస్పి ఇంకా రీ రికార్డింగ్ కంప్లీట్ చేయలేదని.. దీంతో రిలీజ్ డేట్ విషయంలో మేక‌ర్స్ టెన్ష‌న్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఈ రీ రికార్డింగ్ పనులు పైర్తి కాకుండా.. ట్యూన్ పనులు ముగియడంతో.. సినిమా ఫినిష్ చేసి సెన్సార్ కంప్లీట్ చేసుకున్నారు. తాజాగా సినిమా సెన్సార్ రివ్యూ నెటింట వైరల్ గా మారుతుంది. కాగా ఈ సెన్సార్ రిపోర్ట్ ను చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా సినిమా రన్ టైమ్ ఆడియన్స్ కు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఏకంగా 3 గంటల 15 నిమిషాలు న‌డివితో రూపొందుతున్న ఈ సినిమా.. అసలు వర్కౌట్ అవుతుందా.. ఆడియన్స్ను అంతసేపు థియేటర్లలో ఎంగేజ్ చేయగలుగుతుందా అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. కాగా ఈ సినిమాకు సెన్సార్ నుంచి యూ\ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇక శేఖర్ కమ్ముల ఎప్పుడు సినిమాను తెరకెక్కించిన ఓ సెన్సిబుల్ కంటెంట్ తోనే రూపొందిస్తాడు. ఆయన సినిమాల్లో ఉండే డ్రామా ఆడియన్స్‌ను ఆకట్టుకున్నా.. క్యూట్ మూమెంట్స్ ఉన్నా.. సినిమా నిదానంగా సాగుతుందనే విమ‌ర్శ‌లు ఎదుర‌వుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఆయన సినిమాలు ఆల్మోస్ట్ ఎక్కువ ర‌న్ టైర‌తోనే తెర‌కెక్కుతాయి. ఇప్పటివరకు ఫీల్ గుడ్ ఫిలిమ్స్ తీసిన శేఖర్ కమ్ముల.. మొదటిసారి తన జోన‌ర్‌ నుంచి బయటకు వచ్చి.. డిఫరెంట్ అటెంప్ట్ ను ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేశాడు శేఖర్ కమ్ముల.

Kubera Story: 3 గంటల కుబేర..శేఖర్‌కమ్ముల కథలో ఏముంది?

కంటెంట్ బాగుంటే రన్ టైం పెద్ద సమస్య ఉండదు. కానీ.. ఏదైనా తేడా కొడితే మాత్రంభారమంతా ధనుష్, నాగార్జున పైన పడుతుంది. ప్రేక్షకులను అంతసేపు థియేటర్లో కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల ట్రాక్ రికార్డును బట్టి ఏకంగా మూడు గంటల రన్ టైం అంటే అది అడ్వెంచర్స్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మూవీ ప్రొడ్యూసర్.. సునీల్ నారంగ్‌ మాత్రం థియేటర్లలో అంత లాంగ్ ర‌న్‌తో సినిమా రాదు.. ముందు జాగ్రత్త కోసం ఉన్న కంటెంట్ అంతా సెన్సార్ రివ్యూ చేయించాం. మూడు గంటల లోపే కుబేర మూవీ ఉంటుందంటూ వివరిస్తున్నాడు. ఇక తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. అంతేకాదు సినీ వర్గల‌ టాక్ ప్రకారం.. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని.. ఇందులో ధ‌నుష్ నటన నేషనల్ లెవెల్‌లో ఉందంటూ అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక‌ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.