SSMB 29: సంజీవని ఘట్టానికి.. మహేష్ సినిమా మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ SSMB 29. ఈ మూవీ పై ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే.. ఈ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త నెటింట వైరల్‌గా మారుతుంది. ఇక ఇప్ప‌టికే రెండు స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏమై ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల అందరిలోనూ మొదలైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సంజీవని ఘట్టం హనుమంతుడి పాత్రకు.. మహేష్ బాబు రోల్‌కు మధ్య లింక్ ఉందంటూ ఓ న్యూస్ వైరల్‌గా మారుతుంది.

Ramayana Story - Complete Ramayana Story Events In English

అసలు మ్యాటర్ ఏంటంటే.. హనుమంతుడి పాత్ర స్ఫూర్తితోనే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రను డిజైన్ చేశారట మేకర్స్‌. ఇక తాజాగా అందుతున్న టాక్ ప్రకారం.. రామాయణంలోని ఓ ప్రధాన ఘట్టమైన సంజీవని ఘట్టం ఆధారంగా ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రామాయణ యుద్ధంలో మూర్చపోయిన లక్ష్మణుడిని.. స్పృహలోకి తీసుకొచ్చేందుకు హనుమంతుడు సంజీవని కోసం హిమాలయాలకు బయలుదేరుతాడు. అక్కడ ద్రోణగిరి పర్వతాన్ని పెకిలించి.. లంకకు తీసుకువచ్చి సంజీవనితో.. లక్ష్మణుడికి మెలకువ వచ్చి పూర్తి ఆరోగ్యంగా మారేలా చేస్తాడు. ఇక రామాయణంలో ఈ సంజీవని ఎపిసోడ్ ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది.

Is this Mahesh Babu's new look for SSMB29 - Telugu News - IndiaGlitz.com

అంతేకాదు.. హనుమంతుడి అన్‌ కండిషనల్‌ రామభక్తికి, సౌర్య ప్రతాపాలకు ఎగ్జాంపుల్‌గా ఈ ఘట్టం ఉంటుంది. రామాయణంలో ఇదే ప్రధాన ఘట్టంగా వెలుగొందుతుంది. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సంజీవని ఘట్టంలో హనుమంతుడి పాత్ర ఆధారంగానే మహేష్ బాబు పాత్రను డిజైన్ చేశాడట విజయేంద్ర‌ప్రసాద్. ఈ క్రమంలోనే సినిమాల్లో మహేష్ ఓ మహోన్నత లక్ష్యం కోసం ప్రపంచాన్ని చుట్టి వచ్చే అడ్వెంచర్ పర్సన్‌గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక ఇప్పటికే రెండు స్కెడ్యూల్స్‌ను పూర్తిచేసిన ఈ సినిమాకు.. నిన్న మొన్నటి వరకు సమర్ బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమా మూడో షెడ్యూల్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. త్వరలోనే ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది.