టాలీవుడ్ మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో కుబేర సినిమా ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ధనుష్ హీరోగా, అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రష్మిక మందన హీరోయిన్గా మెరవనుంది. కాగా.. మూడేళ్ల క్రితం అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఈ సినిమా.. దాదాపు సంవత్సరం క్రితమే సెట్స్‌పైకి వచ్చింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత.. శేఖర్ కమ్ముల పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రూపొందించిన సినిమా ఇది. తాజాగా షూట్‌ను పూర్తిచేసుకుని.. ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. ఈనెల 20న సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవాలి అనుకున్నా.. అమెజాన్ ప్రైమ్‌తో ఉన్న అగ్రిమెంట్ రిత్యా రిలీజ్ డేట్‌లో చేంజ్ చేసుకోలేని సిచువేషన్ లో మేకర్స్ సతమతమవుతున్నారట.
అయితే అసలు రిలీజ్ డేట్ పోస్ట్ పని చేసుకోవాలని ఆలోచనకు ప్రధాన కారణం.. దేవిశ్రీ ప్రసాద్ అని.. మూవీ టీం మొత్తాన్ని ఆయన ఎరుకాటంలో పడేసాడంటూ టాక్ నడుస్తుంది. సినిమా రిలీజ్‌కు మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే.. ఇప్పటివరకు సినిమాలో ఒక్క సాంగ్ కూడా పూర్తి కాకపోవడం.. అలాగే రీ రికార్డింగ్ పనులు కూడా కంప్లీట్ కాకపోవడంతో.. టీం ఆందోళన పడుతున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని మూవీ ప్రొడ్యూసర్ ఏషియన్స్ సునీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక మరో మూడు రోజుల్లో సినిమా ట్రైలర్ కట్ రిలీజ్ చేయాల్సి ఉంది. అంతేకాదు.. ట్రైలర్ రిలీజ్ అయిన మరో రెండు రోజులకు ఇంకో సాంగ్‌ను ప్రమోషన్స్ లో భాగంగా టీం రిలీజ్ చేయనున్నారట.
ఇలాంటి క్రమంలో.. డిఎస్పి కారణంగా లాస్ట్ మినిట్లో సినిమాకు టెన్షన్ మొదలైందని.. సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. శేఖర్ కమ్ముల మరో పక్కన తన టీంతో కలిసి.. సినిమాకు సంబంధించిన పెండింగ్ వర్క్ సరవేగంగా పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నాడట. అలాగే.. ఇప్పుడిప్పుడే సినిమాపై ఆడియోస్ లో మంచి బజ్ నెలకొంటున్న క్రమంలో.. దేవిశ్రీ తన అవుట్ పుట్ ఇచ్చే విషయంలో ఆలస్యం చేయడం మేకర్స్‌ను టెన్షన్‌లో పడేసిందని.. సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక గత కొద్దిరోజులుగా సంగీత దర్శకుల రీ రికార్డింగ్ లేట్ కావడంతో.. సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే కుబేర రీ రికార్డింగ్ పనుల విషయంలో.. డిఎస్పి ఎలాంటి ప్లాన్ చేస్తాడో చూడాలి.