టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటి క్రియేట్ చేసుకుని సత్తా చాటుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సాహసాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోల మధ్య సహజంగానే స్ట్రాంగ్ పోటి నెలకొంటు్ది. అలా.. టాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ అయినా.. నందమూరి, మెగా కుటుంబాల మధ్య నటనలో ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ పోటీ నడుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య స్ట్రాంగ్ పోటీ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి త్రిబుల్ ఆర్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అసలు తారక్, చరణ్ కలిసి నటించడమే అప్పట్లో అందరికీ షాక్. ఇక ఈ సినిమాలో ఇద్దరూ ఎవరికి వారే వైవిధ్యమైన నటనతో, టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నించి సక్సెస్ అయ్యారు.
పాన్ ఇండియా లెవెల్‌లో సెలబ్రెటీలుగా దూసుకుపోతున్న హీరోలు ఎంతమంది ఉన్నా.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు మాత్రం ఓ ప్రత్యేకమైన క్రేజ్ పాపులారిటీ ఉందని చెప్పాలి. అలా ఈ ఇద్దరి సినిమాలు వస్తున్నాయంటే చాలు.. పాన్ ఇండియా లెవెల్ ఆడియోస్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఇద్దరు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని కసితో ప్రయత్నాలు చేయటమే. వీళ్ళిద్దరూ పాన్ ఇండియన్ హీరోలుగా ఎదిగిన.. ఇద్దరిలో ఎవరి మార్కెట్ ఎక్కువగా ఉంటుంది.. ఎవరు ప్రేక్షకులను మెప్పిస్తారని చర్చలు హట్ టాపిక్‌గా ట్రెంండ్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని విషయాల్లో తారక్ కంటే చరణ్ చాలా బెటర్ అంటూ.. సాధారణ ఆడియోస్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మేటర్ ఏంటంటే కెరీర్ ప్రారంభంలో తారక్ అనవసరమైన స్క్రిప్ట్లను ఎంచుకొని తప్పటడుగులు వేశాడు.
కానీ.. చరణ్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన నరసింహుడు, నా అల్లుడు సినిమాల డిజాస్టర్ ల గురించి ప్రస్తావని తెస్తూ.. ఈ సినిమాలతో తారక్ తీవ్రమైన బ్యాడ్ నేమ్ మూట కట్టుకున్నాడని.. చరణ్ మాత్రం అలాంటి సినిమాలకు అసలు చోటు ఇవ్వకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తాను నటించిన ప్రతి సినిమా మినిమం గ్యారంటీ ఆడేలా జాగ్రత్తలు పడ్డాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కెరీర్ మొదట్లో తారక్ కంటే చరణ్ స్క్రిప్ట్ సెలక్షన్లో చాలా బెటర్ అనిపించుకున్నారని వివరిస్తున్నారు. అయితే తారక్ అభిమానులు మాత్రం దీన్నికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. చరణ్ కెరీర్ స్టార్టింగ్‌లో కంటెంట్ సెలక్షన్ తండ్రి సహాయం చేశాడని.. కానీ తారక్ తన స్క్రిప్ట్ సెలక్షన్ తానే చేశాడంటూ.. కెరీర్ ప్రారంభంలో.. ఎవరికైనా అప్ అండ్ డౌన్ కామన్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.