ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు తెరకెక్కి బ్లాక్‌బస్టర్లుగా నిలుస్తూ ఉండేవి. అప్పట్లో రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా హీరోల దగ్గర నుంచి మేకర్స్ వరకు.. కథ బాగుండి మూవీ హిట్ అయితే చాలు అని సినిమాలో నటించడానికి హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వాళ్ళు. అలాగే స్టోరీ సెలక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని అడుగులు వేసేవారు. ఇక ఇటీవల కాలంలో హీరోల రేంజ్ పూర్తిగా మారిపోయింది. రెమ్యునరేషన్ ముఖ్యంగా భావిస్తున్నారు. కథ ఎలా ఉన్నా.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు .అయితే తీసుకున్న రెమ్యునరేషన్ రేంజ్‌లో సినిమా రిసల్ట్ వస్తుందా అంటే.. దానికి నమ్మకం లేదు.
కొన్ని సందర్భాల్లో హీరో, హీరోయిన్లకు భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి సినిమాలు తెరకెక్కించిన అవి బోల్తా పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి క్రమంలో డిమాండ్ ఉన్న హీరోల రెమ్యూనరేషన్ అంటే ఎలాగూ పెరుగుతాయి. అందులో మనం మాట్లాడుకున్న ఉపయోగం లేదు. కానీ.. ఎలాంటి క్రేజ్ పాపులారిటీ లేని హీరోల సైతం కోట్లల్లో డిమాండ్ చేసి సినిమాల్లో నటిస్తున్నారు. నిర్మాతలు సైతం వారు అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మినిమం రెమ్యూనరేషన్ రెండు మూడు కోట్ల వరకు ఉంటుంది. అలా ఇప్పుడు ఉన్న హీరోలలో ఏ హీరో ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. ఆ లెక్కలు ఏంటో ఒకసారి చూద్దాం.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస బ్లాక్ బాస్టర్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట్లో రూ.10 కోట్ల రేంజ్ లో ఉన్న బాలయ్య రమ్య నరేషన్‌ను ఇప్పుడు ఏకంగా రూ.30 కోట్లకు దాటిపోయింది. మరో స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. రియంట్రి తర్వాత పెద్దగా సినిమాలతో సక్సెస్ అందుకోకపోయినా.. చివరగా చిరు నుంచి వచ్చిన సినిమాలు సక్సెస్ కాకపోయినా.. చిరంజీవి రెమ్యూనరేషన్ ఏకంగా రూ.75 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రూ.50 కోట్ల రెమ్యూనరేషన్, శివ కార్తికేయన్ రూ.30 కోట్ల రెమ్యూనరేషన్, నాని రూ.30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
ఇక రవితేజ రూ.25 కోట్లు, సిద్దు జొన్నలగడ్డ రూ,15 కోట్లు, విశ్వక్ సేన్ రూ.6 కోట్లు, శ్రీ విష్ణు రూ.5 కోట్లు, శర్వానంద్ ఏకంగా రూ.10 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ తాజాగా రూ.8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక సందీప్ కిషన్ కూడా రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడట. ఇలా ఇండస్ట్రీలో ఫేమ్ తో క్రేజ్‌తో సంబంధం లేకుండా మినిమం రెమ్యూనరేషన్ రెండు కోట్ల వరకు ఉండడం అందరికీ షాక్ ను కలిగిస్తుంది. ఇక నిర్మాతల సైతం హీరోలు అడిగినా రెమ్యూనరేషన్ను ఇచ్చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తర్వాత భారాన్ని ప్రేక్షకులపై రుద్దేసి టికెట్ రేట్లు పెంచుతూ తమకు కావలసిన మొత్తాన్ని రప్పించుకుంటున్నారు.