టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. చివరిగా కల్కి, సలార్ సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అరడజను పైగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీబిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. తాజాగా డైరెక్టర్ మారుతి రాజాసాబ్ సినిమా షూట్‌లో గడిపిన ప్రభాస్.. ఈ సినిమా తర్వాత సీతారామం ఫెమ్.. హనురాగపూడి డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందించనున్నారని సమాచారం. ఇక మొదట ప్రభాస్, హనురాగపూడి డైరెక్షన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు.
అసలు వీరిద్దరి కాంబో వర్కౌట్ అవుతుందా.. అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. అయితే.. సినిమా కొత్త.. వైవిద్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతుందన్న టాక్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. ఈ క్రమంలోనే సినిమాపై కూడా మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉండనున్నాయని న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇక ప్రభాస్ ఈ సినిమాల్లో బ్రాహ్మణ అగ్రహారానికి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడట. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా.. తెలుగు సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ హీరోయిన్ నటించబోతుందంటూ.. హను రాఘవపూడి ఏరికోరి మరి.. ఆమెను ప్రభాస్ తల్లిగా ఎంచుకున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది.
ఆమె కూడా ఈ సినిమాల్లో ప్రభాస్ తల్లి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు సిమ్రాన్. ఇక బాలయ్య, సిమ్రాన్ కాంబోలో గతంలో ఎన్నో సినిమాలు తెరకెక్కి సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అంతేకాదు బాలయ్య కూడా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా సిమ్రాన్ నటన పై ప్రశంసల వర్షం కురిపించాడు. సిమ్రాన్ – బాలయ్య కాంబో అంటే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ కిక్ ఉంటుందన్నట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఇప్పుడు సిమ్రాన్ ప్రభాస్ తల్లిగా కనిపించనుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రోల్ కి ఏ రేంజ్‌లో ఎలివేషన్స్ ఉంటాయో.. అదే రేంజ్‌లో ప్రభాస్ తల్లి పాత్ర కూడా హైలెట్ కానుందిని టాక్ వైరల్ గా మారుతుంది. ఇక నిజంగానే ప్రభాస్ తల్లిగా సిమ్రాన్ నటిస్తుందో.. లేదో.. తెలియాలంటే టీం అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.