టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన, డ్యాన్స్ మాటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినీ కెరీర్‌తో పాటు.. పర్సనల్ లైఫ్ లోను తన మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటున్న తారక్.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తారక్ చేతినిండా ప్రాజెక్టులతో బిజీ లైన్ అప్లో సెట్ చేసుకున్నాడు. ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో నటించాలని ఎంతో మంది హీరోయిన్లు ఆరాటపడుతున్నారు.
ఇప్పటికే చాలామంది ముద్దుగుమ్మలు ఈ విషయాన్ని ఓపెన్ గా వివరించిన సంగతి తెలిసిందే. ఇక ఇంతమంది స్టార్ హీరోయిన్స్ అంతగా అభిమానిస్తున్న ఎన్టీఆర్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో ఒకసారి తెలుసుకుందాం తెలుసుకుందాం. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో తన కెరీర్‌లో నటించిన ఎన్టీఆర్.. ఫేవరెట్ హీరోయిన్ మాత్రం నిత్య మీనన్ అట. ఈ విషయాన్ని తారక్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆమె న్యాచురల్ యాక్టింగ్ తనకు చాలా చాలా ఇష్టమని ఓపెన్ గానే వివరించాడు. ఇక జనతా గ్యారేజ్ లో వీళ్ళిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. స్క్రీన్ పై కనిపించింది తక్కువ టైం అయినా.. నిత్య మీనన్ తన నటనతో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఇద్దరు ట్యాలెంటెడ్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలని ఆశ పడుతున్నారు అభిమానులు.