కెరీర్‌లో ఎన్నో హిట్స్ కొట్టిన కాజల్.. కానీ ఆ విషయంలో మాత్రం ఆల్వేస్ ఫెయిల్..!

టాలీవుడ్ ముద్దుగుమ్మ‌ కాజల్ అగర్వాల్.. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చందమామతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. త‌ర్వాత మగధీర సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇలా కెరీర్‌ ప్రారంభంలోనే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ.. తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

Kajal Aggarwal Biography

ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో నటించి వరుస సక్సెస్‌లు అందుకున్న ఈ అమ్మడు.. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న టైంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్‌లును ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఈమె.. కొడుకు పుట్టిన తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చినా.. తాజాగా సినిమాల్లో రీ ఎంట్రీతో మరోసారి వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. పెళ్ళైన అమ్మడి అందం ఫిట్నెస్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. అయితే తన కెరీర్లో నటన, అందంతో ఎంతోమంది కుర్రకారును కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంది.

Kajal Aggarwal begins shoot for Salman Khan Sikandar - India Today

అది మరేదో కాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించి సక్సెస్ అందుకోవడంలో. ఇప్పటివరకు తను ఎన్నో లేడి ఓరియంటెడ్‌ సినిమాల్లో నటించిన ఒక్క సినిమా కూడా సక్సెస్ అందుకోలేదు. అంతేకాదు.. కొంతకాలం క్రితమే సత్యభామ అనే మరో లేడి ఓరియంటెడ్ సినిమాతో హీరోయిన్గా నటించింది .నటనకు మంచి మార్కులు పడ్డా.. కమర్షియల్‌గా మాత్రం సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది. అలా.. కాజల్ ఎన్ని బ్లాక్ బస్టర్లు అందుకున్నా.. లేడీ ఓరియంటెడ్‌ సినిమా విషయల‌లో మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవుతూనే వస్తుంది.