జంపింగ్ జాక్‌గా బాలీవుడ్‌లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నటుడు జితేందర్‌కు ప్రస్తుత వయస్సు 83 ఏళ్ళు. 1942 ఏప్రిల్ 7న అమృత్‌సర్‌లో జన్మించాడు. తన 14 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ కాలేజ్ ఈవెంట్లో నే అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాడు. తను కాలేజీలో ఉండంగానే.. జితేంద్ర బాలీవుడ్ స్టార్ గా రాణించారు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అదికాస్తా ప్రేమగా మారింది. అలా ఎన్నో ఒడిదుడుకుల తర్వాత 1974 అక్టోబర్ 9న జితేంద్ర తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా శోభను వివాహం చేసుకున్నాడు. ఇక జితేంద్ర, శోభ దంపతులకు ఏక్తాకపూర్, తుషారా కపూర్ అనే ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత.. జితేంద్ర హేమమాలినితో ఎఫైర్ పెట్టుకున్నారు.
అదే టైంలో శోభా,జితేంద్రల మధ్యన వివాదాలు తలెత్తడం.. అలాగే అప్పటికే హేమమాలిని కూడా ధర్మేంద్రతో ప్రేమ వ్యవహారం నడుపుతుంది. కానీ.. అది అఫీషియల్ బంధం కాదు. అయితే.. ఈ కన్ఫ్యూజన్‌ల అన్నింటితో సతమతమైన జితేందర్.. హేమమాలిని వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. వీళ్ళిద్దరూ పెళ్లికి కూడా సిద్ధమయ్యాక పెళ్లి వేదిక వద్దకు చేరుకున్న ధర్మేంద్ర.. తాగిన మత్తులో అక్కడ గొడవ చేసి పెళ్లిని ఆపేశాడు. ఇక తర్వాత సౌత్ లోను ఎన్నో సినిమాలను నటించిన జితేంద్ర.. ఈ క్రమంలోనే శ్రీదేవిని కలిశారు. బాలీవుడ్ లో ఆఫర్ల కోసం శ్రీదేవిని ముంబైకి తీసుకువెళ్లిన జితేంద్ర.. ఆమెతో కలిసి పలు సినిమాలో నటించాడు. దీంతో వీరిద్దరి మధ్య రూమర్లు మొదలయ్యాయి. అప్పటికే జితేంద్రకు పెళ్ళై ఎదురు పిల్లలు ఉన్నారు.
శ్రీదేవితో రిలేషన్ ముగించకపోతే తాను ఇల్లు వదిలి వెళ్ళిపోతానని శోభ జితేందర్‌కు వార్నింగ్ ఇవ్వడంతో.. జితేందర్.. శ్రీదేవితో తన ప్రేమ బంధాన్ని తెంచుకొని.. శోభతో పెళ్లి బంధాన్ని కాపాడుకున్నాడు. అంతేకాదు జితేంద్ర తన కెరీర్లు జయప్రదతోను ఎన్నో సినిమాల్లో నటించాడు. శ్రీదేవి లాగా జయప్రద కూడా దక్షిణాది నుంచి బాలీవుడ్కు వెళ్ళింది. ఆమెను బాలీవుడ్ లో జితేంద్ర ఎంతగానో ప్రమోట్ చేశాడు. ఈ క్రమంలోనే జయప్రదకు సైతం స్టార్ ఇమేజ్ వచ్చింది. అలా ఎవరినైనా తను స్టార్ హీరోయిన్ చేయగలనని ప్రూవ్ చేసుకున్న జితేంద్ర.. మధ్యలో జయప్రదను చాలా లైట్ తీసుకోవడంతో వీరిద్దరి మధ్య వివాదాలు బ్రేకప్ అయ్యిందట. ఇలా పెళ్లయ్యాక కూడా జితేంద్ర హేమమాలిని, శ్రీదేవి, జయప్రదలతో ఎఫైర్‌లు నడిపినట్లు ఇప్పటికీ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.