సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకుని చాలామంది నటులు కేవలం సినిమాలతోనే కాకుండా.. రకరకాల వ్యాపారాల్లోనూ అడుగుపెట్టి సక్సెస్ సాధించి కోట్లకు పడగలు విప్పుతున్నారు. అయితే.. లగ్జరీగా తమకోసం కట్టుకున్న ఇల్లును రెంటుకు ఇచ్చి వాటి ద్వారా కూడా లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్న స్టార్ హీరో గురించి చాలామందికి తెలిసి ఉండదు. ఎస్ మీరు వింటున్నది కరెక్టే. రూ.300 కోట్లతో లగ్జరీ హౌస్ స్థాపించిన ఈ హీరో.. కేవలం రోజుకు రెండు లక్షల రెంట్ ను వసూలు చేస్తూ.. తన సంపాదనను అంతకంతకు పెంచుకుంటున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు..? రెండు లక్షలు రోజుకు రెంట్ ఇచ్చేంతలా ఆ ఇంటి స్పెషాలిటీస్ ఏమై ఉంటాయో.. ఒకసారి తెలుసుకుందాం.
ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న ఆ స్టార్ హీరో మరెవరో కాదు బాలీవుడ్ భాద్‌షా షారుక్ ఖాన్. కోట్లల్లో ఆస్తులను సంపాదించిన ఆయన.. రూ.300 కోట్లతో స్థాపించిన ఆ ఇల్లు ఇండియాలోది కాదట. అమెరికా లాస్ ఏంజెల్స్ లోని.. బేవార్లి హిల్స్‌లో ఆ ఇంటిని కట్టుకున్నాడు. ఆరు బెడ్ రూమ్లతో పాటు.. స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ క్యాబిన్, టెన్నిస్ కోర్ట్, పెద్ద సిట్టింగ్ ఏరియా, సిట్టింగ్ ఏరియా నుంచి లొకేషన్ చూసేలా గ్లాస్ ఫిట్టింగ్.. అతిపెద్ద రూమ్ లాంటి రిచెస్ట్ బాత్రూం, లగ్జరియాస్ డ్రాయింగ్ రూం..ఎక్కడ చూసినా ఖరీదైన సోఫాలు, వాల్ పేయింటింగ్లు, షో పీసులతో అందమైన రంగుల దీపంలా.. ఈ డ్రాయింగ్ రూమ్ డిజైన్ చేయించారట.
ఈ క్రమంలోనే షారుక్ ఎంతో అందంగా.. అద్భుతమైన, అదునాతనమైన టెక్నాలజీలతో రూపొందించిన ఈ ఇంటిని అద్దెకు కూడా ఇస్తున్నాడని తెలుసుకొని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈ బంగ్లాలో రెండు లక్షలు కడితే రోజంతా స్పెండ్ చేయొచ్చట. కానీ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి రెండు లక్షలు కట్టేస్తే ఇల్లు రాదు. నెలరోజుల ముందే ఇంటిని బుక్ చేసుకోవాల్సి ఉంటుందట. ఇక షారుఖ్ ఖాన్ బంగ్లా అని తెలియడంతో ఎంతోమంది రిచెస్ట్ షారుక్ ఫ్యాన్స్ తో పాటు.. సెలబ్రిటీస్ సైతం లాస్ ఏంజల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ రెంట్ పే చేసి స్పెంట్ చేస్తూ ఉంటారని.. అలా షారుక్ ప్రతి ఏడాది కోట్లల్లో సంపాదిస్తున్నట్లు సమాచారం. కాగా.. ఇప్పటికే 8000 కోట్ల అధిపతి అయ్యిన షారుక్‌కు సొంత ఐపిఎల్ టీంతో పాటు.. మరెన్నో వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. ముంబైలో ప్రస్తుతం తాను ఉంటున్న ఇల్లు సైతం రూ.300 కోట్లకు పైగా విలువ చేస్తుందట.