ఇండస్ట్రీలో ప్రతి ఏడది ఎంతోమంది స్టార్స్.. సెలబ్రెటీలుగా సక్సెస్ సాధించాలని అడుగుపెడుతూ ఉంటారు. కసితో ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చేదు అనుభవాలను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతోమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు.. ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది హీరోయిన్స్.. కెరీర్ బిగినింగ్ లో సమస్యలను గురించి మాట్లాడుతూ.. హీరోల వల్ల, దర్శక నిర్మాతల వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామని చెబుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ కోసమే ఎలాంటి ఆఫర్ అయినా ఇచ్చేందుకు రెడీ అయిపోతారు.
అలాంటి సమస్యలు ఎదుర్కొన్న వారిలో ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న స్టార్ హీరోయిన్ కూడా ఒకటి. తను 23 ఏళ్ల వయసులోనే ఓ డైరెక్టర్ తనను బ్లౌజ్ తీసి నుంచోమన్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఇంతకు ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.. బ్లౌజ్ తీసేయమన్న ఆ డైరెక్టర్ ఎవరు.. అసలు మేటర్ అంటే ఒకసారి తెలుసుకుందాం. ఆ హీరోయిన్ ఎవరో కాదు మాధురి దీక్షిత్. ఈ పేరు తెలియని సినీప్రియలో ఉండరు. గతంలో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది.
ఇప్పటికి తరగని అందంతో లక్షలాదిమంది కుర్రకారును ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. సెకండ్ ఇన్నింగ్స్‌లోను వరుస హిట్లు అందుకుంటు దూసుకుపోతుంది. ఇక ఇంతకీ మాధురి దీక్షిత్‌ను బ్లౌజ్ తీసేసి నుంచోమన్న ఆ డైరెక్టర్ మరెవరో కాదు బాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న టీను ఆనంద్. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమితాబచ్చన్, మాధురి దీక్షిత్ కలిసి నటించిన షనాక్త్ సినిమా గురించి రియాక్ట్ అవుతూ.. సినిమాలో ఓ సీన్ కోసం.. ప్రమాదంలో ఉన్న హీరోని కాపాడేందుకు హీరోయిన్.. విలన్ ముందు బ్లౌజ్ తీసే సీన్ ఉంటుందని.. ఇక ఆ పరిస్థితుల్లో సీన్ చాలా అవసరం అంటూ చెప్పుకొచ్చాడు.
విలన్ ముందు అమ్మాయి ఉంటే అతని హీరోని ఏం చేయడు.. ఆ సన్నివేశం గురించి నేను ముందుగానే మాధురి దీక్షిత్ కు వివరించి.. అన్ని ఒప్పుకున్న తర్వాత ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అదే నా మొదటి సీన్. కరెక్ట్ గా షూటింగ్ టైంలో నేను ఆ సీన్ చేయను అని ఆమె చెప్పేసింది. దీంతో ఇద్దరు మధ్య గొడవ మొదలైంది.. దానికి నేను ఆమెను సినిమా నుంచి తప్పుకోమని చెప్పేసా. ఈ క్రమంలోనే అమితాబ్ వచ్చి గొడవను పరిష్కరించాలని చూశారు. ఏదైనా అభ్యంతరం ఉంటే ఒప్పుకునే ముందే చెప్పాలని ఆయన వివరించారు. తర్వాత కొంత సమయానికి మాధురి అసిస్టెంట్ వచ్చి ఆమె సీన్ చేయడానికి ఒప్పుకున్నారని వివరించిందంటూ టిను ఆనంద్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.