మొదట ఇండియన్ సినీ రాజధానిగా ముంబై ఉండేదనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల కాలంలో ఇండియన్ సినీ పరిశ్రమ రాజధానిగా హైదరాబాద్ మారిపోతుందని.. కారణం భారతదేశంలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకులు, హీరోలంతా ఇక్కడి వాళ్లే కావడం.. ఎక్కువ సినిమాలు రూపొందించేది ఇక్కడే కావడం.. ఇలా రకరకాల కారణాలతో తెలుగు సినీ పరిశ్రమ ఇండియన్ ఇండస్ట్రీకే రాజధానిగా మారిపోతుంది. గతంలో ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న చిన్న చిన్న సెలబ్రిటీస్ నుంచి స్టార్ నటుల వరకు ఒక్కసారైనా బాలీవుడ్ లో నటించాలని బాలీవుడ్ సినిమాలు తీయాలని తహతహలాడుతూ ఉండేవారు. అలా చేయడం అంటే తమకు మంచి ప్రమోషన్ వచ్చినట్లుగా ఫీలయ్యావారు.
ఈ క్రమంలోనే ఒకప్పటి సౌత్ స్టార్స్ చాలామంది.. హిందీ సినిమాలో తమ సత్తా చాటుకోవాలని.. తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవాలని ప్రయత్నించి ఫెయిల్ అవుతూ వచ్చారు. అయితే.. ప్రస్తుతం ఇండియన్ సినిమా పై ముంబై ముద్ర గతంలో మారబోతుందని.. ఇప్పటిదాకా ముంబై కేంద్రంగా సాగుతున్న ఇండియన్ సినీ ఇండస్ట్రీ.. క్రమక్రమంగా హైదరాబాద్ కేంద్రంగా మారి.. ముంబై ఆదిపత్యాన్ని కోల్పోబోతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో బాలీవుడ్లో అవకాశాల కోసం సౌత్ సెలెబ్రిటీస్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. అంతేకాదు.. బాలీవుడ్ నటులు.. సాంకేతిక నిపుణులు అంటే.. సౌత్‌లో విపరీతమైన క్రేజ్ నెలకొనేది. అక్కడ నటించిన చిన్న చిన్న సెలబ్రిటీస్ సైతం తెలుగు సినిమాల్లో నటించాలంటే డబల్ త్రిబుల్ రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. తెలుగులో పాన్ ఇండియా సినిమాల జాతర మొదలైంది. సినీ పరిశ్రమకు కొత్త వన్నె తెచ్చి పెట్టింది. హిందీ సినిమాను పెద్ద మార్కెట్లో ఓ చిన్న భాగంగా మార్చేసి.. తెలుగు సినిమా క్రేజ్ రెట్టింపు చేసింది.
ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే కాదు తమిళ, మళయాళ సినిమాలు సైతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నాయి. ఇలా.. సౌత్ సినిమాలు భారీ సక్సెస్ రేట్లతో దూసుకుపోతున్న క్రమంలో.. హైదరాబాద్‌కు ఇది మంచి లాభాలను తెచ్చి పెడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణం.. ముఖ్యంగా సౌత్ లో ఇతర ఏ పరిశ్రమ లో అయినా హైదరాబాదు లాంటి.. వైవిద్య భరిత అవకాశాలు, అత్యాధునిక నగరం లేకపోవడమే. దీంతో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ చాలా వరకు ఇక్కడ రెస్టారెంట్లు, బోటిక్ లు, జిమ్లు అన్ని స్థాపిస్తూ.. బిజినెస్ రంగాన్ని ప్రారంభిస్తూ తరచు రాకపోకలు కొనసాగించేందుకు.. ఇక్కడ కూడా అవకాశాల కోసం ప్రయత్నించేందుకు.. కారణాలను సృష్టించుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖులు సైతం వాళ్ల వ్యాపారాల్లో భాగమవుతున్నారు.