ఇండస్ట్రీలో మంచి లొకేషన్స్‌తో సినిమా అంటే కచ్చితంగా అందరికీ రామోజీ ఫిలింసిటీ ఎక్కువగా గుర్తుకు వస్తుంది. అయితే రామోజీ ఫిలింసిటీనే కాకుండా.. షూటింగ్స్ ఎక్కువగా జరిగే మంచి లొకేషన్స్ ఉన్న మరో ఊరు ఉందని చాలామందికి తెలియదు. అక్కడ ఇప్పటికే వందల కొద్ది సినిమాలు వేల కొద్ది సాంగ్స్ షూటింగ్స్ జరిగాయని ఎవరు ఊహించి ఉండరు. ఇంతకీ ఆ ఊరు ఏంటో.. ఆ ప్లేస్ ఎక్కడ ఉందో.. ఎన్ని సినిమాలు షూటింగ్స్ జరిగాయో ఒకసారి తెలుసుకుందాం.
ఆ ఊరు మరేదో కాదు.. తమిళనాడులోని పోల్లచ్చి అనే ప్రాంతం. ఎక్కడ ఎంతో మంది ఫిలిం మేకర్స్ తమ సినిమా షూట్లో చేస్తూ ఉంటారు. ఇక్కడ లొకేషన్స్.. నేచురల్ వ్యూ చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఇప్పటివరకు ఏకంగా 1500 కు పైగా సినిమాలు.. 5000కు పైగా పాటల షూట్స్ జరిగాయట. అంత అందంగా ఈ పొల్లాచ్చి గ్రామం ఉంటుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది స్టార్లకు సంబంధించిన సినిమాల షూటింగ్స్ పొల్లాచ్చి లోనే జరిగాయి.
అంతేకాదు.. ఈ పొల్లాచ్చి అందమైన లోకేషన్లకే కాకుండా.. కొబ్బరి కి రాజధానిగాను పిలవబడుతుంది. ఇక్కడ పండే కొబ్బరి బోండాలకు దేశం అంత మంచి డిమాండ్ నెలకొంది. దీంతో తమిళనాడులో పొల్లచ్చి ఫేవరెట్ షూటింగ్ స్పాట్‌గా మారింది. ఈ క్రమంలోని ఈ ఏరియా కు సంబంధించిన ఎన్నో మంచి మంచి లొకేషన్స్ పిక్స్ సైతం వైరల్ గా మారుతున్నాయి.