స్టార్ హీరోయిన్ సమంతకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలం పాటు ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తర్వాత చైతూతో విడాకులు, మయోసైటిస్ కారణంగా టాలీవుడ్‌కు మెల్లమెల్లగా దూరమైన ఈ అమ్మడు.. దాదాపు తెలుగు సినిమాల్లో నటించి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది.
అయితే.. మయాసైటిస్ ట్రీట్మెంట్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. అక్కడ పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించాల్సిన ఓ క్రేజీ ప్రాజెక్టులో సమంత ఛాన్స్ కొట్టేసిందట. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. అసలు డీటెయిల్స్ అంటే ఒకసారి చూద్దాం. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి సాలిడ్ సక్సెస్ తర్వాత అట్లీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకోవాలని మొదటి టీం భావించారట. కానీ.. ప్రియాంక చోప్రా దీనికి రిజెక్ట్ చేయడంతో అప్లేస్‌లో సమంతను అట్లీ లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఎప్పటినుంచో సమంత టాలీవుడ్ సినిమాల్లో నటించడం లేదు. ఈ క్రమంలోనే తెలుగు ఆడియన్స్ కూడా సమంత నుంచి ఒక్క క్రేజీ ప్రాజెక్ట్ వస్తే బాగుంటుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రాజెక్టులో అమ్మడు ఛాన్స్ కొట్టేసింది అంటూ తెలియడంతో.. అభిమన్లు పండగ చేసుకుంటున్నారు. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.