మరోసారి ఆస్కార్ బరిలో త్రిపుల్ ఆర్.. ఈసారి ఏ క్యాటగిరి అంటే..?

ఇండియన్ సినీ ఇండస్ట్రీకి మొట్టమొదటి ఆస్కార్ అందించిన ఘనత త్రిపుల్ ఆర్ సినిమాకు దక్కిన సంగతి తెలిసిందే. ద బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో త్రిబుల్ ఆర్ కు ఆస్కార్ అవార్డు దక్కింది. ఇక అకాడమికల్ అవార్డ్స్ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మరోసారి త్రిబుల్ ఆర్‌ను గుర్తు చేసుకుంది జ్యూరీ. అసలు దీని వెనుక కారణమేంటో ఒకసారి తెలుసుకుందాం.. ఇండియన్ ఆడియన్స్ అంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా, గౌరవంగా భావించే ఎన్నో ఏళ్ల కళ ఆస్కార్. మన ఇండియన్ సినిమాలు కూడా ఆస్కార్ అవార్డు అందుకుంటే చూడాలని కోట్లాదిమంది అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు.

RRR - MPCVFX

ఆ కల త్రిబుల్ ఆర్‌తో నెరవేరింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో త్రిబుల్ ఆర్.. నాటు నాటు పాట‌కు అవార్డును దక్కించుకుంది. ఆస్కార్ వచ్చిన తర్వాత అకాడమిక్ జ్యూరీ ఇండియన్ సినిమాల ప్రస్తావన ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. అలా.. తాజాగా అకడమిక్‌ బ్రాండ్స్ ఆఫ్ యాక్టర్స్ లిస్టులో ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరు చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి ట్రిపుల్ ఆర్‌ను ఆస్కార్ జ్యారీ గుర్తుచేసుకుంది. అకాడమిక్ జ్యూరీ ప్రారంభమై వందేళ్లు పూర్తయిన క్రమంలో.. అవార్డుల లిస్టులో కొన్ని కొత్త కేటగిరీలను చేర్చారు.

Oscars Introduce Stunt Design Category; Rajamouli Thrilled With The RRR Visual On The Announcement | Filmfare.com

ఈ లిస్టులో యాక్షన్ డిజైన్ క్యాటగిరిని ట్రిపులర్ లోని యాక్షన్ స్టిల్‌తో అనౌన్స్ చేయగా.. ఇండియన్ ఫ్యాన్స్ అంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అంతర్జాతీయ వేదికపై త్రిపుర ప్రస్తావన రావడం తెలుగు ఆడియన్స్‌ను ఆస్కార్ వైబ్‌లోకి తీసుకువెళ్లింది. దీని గురించి రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ను షేర్ చేసుకున్నారు. వందేళ్ళ కల ఇప్పుడు నెరవేరింది అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. యాక్షన్ డిజైన్ కేటగిరీలో ఎంపిక చేయడం పై సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రాజమౌళి పోస్ట్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది.