టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరో గానే కాకుండా.. ప్రొడ్యూసర్ గాను ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆయన ప్రజెంటర్గా వ్యవహరించిన కోర్టు సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నాని.. త్వరలోనే హీరోగా హిట్ 3 సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించినన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ప్రమోషన్స్ ప్రారంభించారు టీం.
ఇందులో భాగంగా.. సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన సందడి చేశారు. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. మీరు రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన హీరో.. టైర్ వన్ జాబితాలో ఉన్నట్టే అని ఓ విలేకరు మాట్లాడుతుండగా.. నాని దానిపై రియాక్ట్ అవుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. నాని మాట్లాడుతూ అది మనం క్రియేట్ చేసుకున్న పదమే.. నటుడిగా ఎవరికి తగ్గట్టు వాళ్ళు సినిమాలు చేస్తూ బానే ఉన్నారు.
నటులను ఆ పేర్లతో ఎందుకు సపరేట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఆ కాన్సెప్ట్ స్టుపిడ్ కాన్సెప్ట్. ఎవరు మొదలుపెట్టారో దాన్ని మనమంతా కంటిన్యూ చేస్తున్నాం. ముందా కాన్సెప్ట్ ఆపేస్తే సినీ పరిశ్రమ బాగుంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక పరిశ్రమ బాగుంటే అందరం హ్యాపీగా ఉంటాం అని నాని వెల్లడించారు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.