ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు అనిపిస్తుంది. అది కూడా వీరందరూ మూడోవసారి సినిమా.. తారక్‌ను సెంటిమెంట్ గా తీసుకుంటున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలు ఈ మూడోసారి సెంటిమెంట్ ఏంటి.. ఆ మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి మొదట రెబల్ స్టార్ తో బాహుబలి, తర్వాత గ్లోబల్ స్టార్ రాంచరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో త్రిబుల్ ఆర్ సినిమాలను తీసి పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
మొదట బాహుబలి తో పాన్ ఇండియాని షేక్ చేసిన ఆయన.. త్రిబుల్ ఆర్‌తో గ్లోబల్ ఇమేజ్ను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే తరహాలో వెళుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ లెక్కల మాస్టారు పుష్ప, పుష్ప 2లతో రెండు సాలిడ్ సక్సెస్‌లు అందుకని పాన్ ఇండియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే రాంచరణ్ తో ఈయన సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నాడు సుక్కు. ఇప్పటివరకు లెక్కల మాస్టారు లెక్కలు తప్పింది లేదు. ఈ క్రమంలోనే చరణ్ సినిమా అయిపోయిన తర్వాత సుకుమార్ నాన్నకు ప్రేమతో కాంబినేషన్ ని రిపీట్ చేయనున్నాడని.. 2027లో తారక్ తో ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
అంటే ఇక్కడ రాజమౌళిలానే సుకుమార్ కూడా పుష్ప, పుష్పా 2 లతో పాన్ ఇండియా సక్సెస్ కొట్టి.. చరణ్‌తో గ్లోబల్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ తో మూడో సినిమాకు పాన్ వరల్డ్ ప్రాజెక్టును ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ కూడా కే జి ఎఫ్, కేజిఎఫ్ 2 సిరీస్‌లతో పాన్ ఇండియాను షేక్ చేసిన తర్వాత.. సలార్‌తో గ్లోబల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే మూడోసారి మీటింగ్లో తారక్‌తో ప్లాన్ చేశాడట. ఇక ఈ ప్రాజెక్టు కూడా పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతుందని.. డ్రాగన్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది అంటూ.. జక్కన తరహాలో రెండు పాన్ ఇండియా హిట్లు మూడవ గ్లోబల్ హీట్ తర్వాత పాన్ వరల్డ్ ప్రాజెక్టును రాజమౌళి సెట్స్ పైకి తీసుకువచ్చినట్లే సుకుమార్, ప్రశాంత్‌నిల్ ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్ఆరు.
అయితే ఈ మూడోసారి సినిమాలో ఎన్టీఆర్‌ను హీరోగా చేయనున్నాడన్న టాక్ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఇక సందీప్ రెడ్డి వంగా కూడా ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత ప్రస్తుతం ప్రభాస్ తో గ్లోబల్ రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియన్ డైరెక్టర్స్ అంత కట్టకట్టుకుని తారక్ చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారంటూ.. ఎన్టీఆర్ క్రేజ్ మరింతగా పెరగనంది.. తారక్ కాల్ షీట్స్ దర్శకులకు అవసరం పడతాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తారక్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.