ఉపాసన ప్రతిరోజు ఓ పేపర్ కాల్చివేస్తుందా.. కారణం అస్స‌లు ఊహించలేరు..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య.. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఉపాసనకు ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచితనం, మాట తీరుతో ఎంతోమందిని తన వైపు తిప్పుకున్న మెగా కోడలు.. మెగా అభిమానులను సైతం మెప్పించింది. మొదట్లో.. ఈమె చ‌ర‌ణ్‌కు సరైన జోడి కాదని.. చరణ్ కు అస్సలు సెట్ కాదని రకరకాల నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ వచ్చినప్పటికీ.. వాటన్నింటినీ దాటుకుని అందరి అభిమానాన్ని దక్కించుకుంది. ఇక ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా.. ఉపాసన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు ట్విటర్లో అభిమానులకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది.

ట్విట్టర్లో ఆమె పోస్ట్ చేసే విషయాల పట్ల మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో ఆమె చేసిన పోస్ట్లు తెగ వైరల్ గా మారుతుంది. అదే పేపర్ థెరఫీ. ఇంతకీ ఆ పేపర్ ధరపీ ఏంటో.. ఆ విషయాలు ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. సోషల్ మీడియా వేదికగా పేపర్ థెరఫీ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. తనకు ప్రతిరోజు వచ్చే నెగటివ్ ఆలోచనలన్నీ పేపర్‌పై రాస్తానని.. ఆ నెగెటివ్ విషయాల లిస్టును ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి చూసుకొని.. ఏదైనా పరిష్కారం దొరికేది ఉందా అని ఆలోచిస్తా.. వాటిల్లో పరిష్కారం రాని ఆలోచనలు ఉంటే తాను నెగటివ్ విషయాలను రాసుకున్న కాగితాన్ని కాల్చిపారేస్తా.. ఇదే పేపర్ థెరపీ అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.

Charan moved to my parent's house to support me during postpartum phase: Upasana | Telugu Movie News - Times of India

ఇలా చేయడం వల్ల స్ట్రెస్ నుంచి రిలీఫ్ వస్తుందని.. సంతోషంగా నిద్రపోతాను అంటూ ఉపాసన వెల్లడించింది. ఈ సింపుల్ టెక్నిక్ ను ఫాలో అయ్యి మన లైఫ్ లో ఎదురయ్యే నెగటివ్ ఆలోచనల నుంచి స్ట్రెస్ నుంచి విముక్తి పొందవచ్చు అంటూ ఉపాసన మెగా ఫ్యాన్స్‌కు మంచి సలహా ఇచ్చింది. ఈ క్రమంలోనే మెగా అభిమానులు.. మెగా హీరోలు చేసే సినిమాలనే కాదు.. వారిలో వ్యక్తిత్వా, వికాసానికి సంబంధించిన కొత్త విషయాలను అభిమానులతో పంచుకుంటుంది ఉపాసన. అంతేకాదు ఈజీగా పనులు చేసే టెక్నిక్స్ కూడా ఆమె అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. స్ట్రెస్ రిలీఫ్ తీసుకోవడానికి కొత్త పద్ధతిని అభిమానులతో షేర్ చేసుకోవడం సోషల్ మీడియాలో క్రేజీ టాపిక్ గా తెగ ట్రెండ్ అవుతుంది.