తారక్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్లకు బీజం పడింది ఎక్కడో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస బ్లాక్బస్టర్లతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏ చిన్న విషయమైనా తెలుసుకోవడానికి కేవలం తెలుగు అభిమానులే కాదు.. పాన్‌ ఇండియా లెవెల్‌లో ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక.. గత 14 సినిమాల నుంచి సక్సెస్ ట్రాక్‌లో తార‌క్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా తారక్ సినీ కెరీర్ బ్లాక్ బాస్టర్లు బీజం పడిన సినిమా మాత్రం ఆది అని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. భారీ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్‌గా వివి. వినాయక్‌ను దర్శకుడుగా పరిచయం చేసిన ఈ సినిమా 2002లో రిలీజ్ అయ్యి ఫ్రాక్షన్ సినిమాలకు సరికొత్త ఒర‌వ‌డిని పరిచయం చేసింది.

జూ ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్లో మూవీ ఖరారు! | Jr Ntr, VV Vinayak's new  movie details - Telugu Filmibeat

బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. హీరోగా ఎన్టీఆర్‌ను పాపులర్ చేసి.. మాస్ హీరోగా నిలబెట్టింది. ఇక అప్పట్లో కేవలం రెండు కోట్లతో రూపొందిన ఈ సినిమా ఎన్టీఆర్ పవర్ ప్యాక్‌డ్‌ పర్ఫామెన్స్ తో రికార్డ్ స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టింది. ఏకంగా రూ.18 కోట్ల కలెక్షన్లు రాబట్టి 121 సెంటర్లో 50 రోజులు, 96 సెంటర్లలో 100రోజులు ఆడిన ఘనతను సాధించింది. ఇక ఎన్టీఆర్‌కే కాదు.. వి.వి. వినాయక్ కెరీర్‌ను కూడా మలుపు తిప్పింది. అయితే వీరిద్దరు కాంబోలో సినిమా తెరకెకడానికి వెనుక పెద్ద స్టోరీనే నడిచిందని.. తాజాగా డైరెక్టర్ మల్లిడి వ‌శిష్ఠ‌ తండ్రి నిర్మాత మల్లాడి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Watch Aadhi (Telugu) Full Movie Online | Sun NXT

వడ్డే నవీన్ హీరోగా చెప్పాలని ఉంది సినిమా అసోసియేట్ డైరెక్టర్ గా వివి వినాయక వ్యవహరించాడని.. ఈ సినిమా సాంగ్ షూట్ కోసం అవుట్ డోర్ వెళ్ళారని.. అదే టైంలో ఎన్టీఆర్ – సుబ్బు సినిమా పాటల షూట్ కోసం అక్కడికి వెళ్లారని.. వినాయక్, ఎన్టీఆర్ ఒకే హోటల్లో దిగడం.. అక్కడ వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడడంతో త్వరలోనే నేను డైరెక్టర్ ని కాబోతున్నానని ఎన్టీఆర్‌కు వినాయక్ చెప్పాడట. ఎవరన్నా హీరో అని ఎన్టీఆర్ అడగగా.. ఆకాష్ హీరో అని బెల్లంకొండ సురేష్ నిర్మాత అని వినాయక్ వివరించాడట. ఆ మాటలు విన్న ఎన్టీఆర్.. ఆ కథ ఏదో నాకు చెప్పు.. నచ్చితే నేనే చేసేస్తా అని ఆఫర్ ఇచ్చాడట. దానికి వినాయక్‌ సరే అని.. హైదరాబాద్ వెళ్ళాక కథ చెప్తా అని వివరించాడు. హైదరాబాద్ వచ్చాక ఎన్టీఆర్కు అనుకున్నట్టే కథలు చెప్పడం.. అది నచ్చేయడంతో ఆది సినిమా వచ్చిందని.. తార‌క్ బ్లాక్ బ‌స్ట‌ర్‌కు బీజం అక్కడి నుంచే పడిందంటూ వివ‌రించాడు మల్లిడి సత్యనారాయణ.