” ఆర్ఆర్ఆర్ ” రికార్డులను బద్దలు కొట్టిన నాని ” హిట్ 3 “..!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఓ పక్క హీరోగా నటిస్తూనే.. మరో పక్కన ప్రొడ్యూసర్ గాను సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కోర్ట్ సినిమాతో ప్రొడ్యూసర్ గా బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న నాని.. నెక్స్ట్ హిట్ 3 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. తానే ప్రొడ్యూసర్ గాను వ్యవహరించిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో బజ్‌ పెంచేందుకు రకరకాలుగా ప్రమోట్ చేస్తున్నారు టీం. తాజాగా నాని.. ఈ సినిమా ప్రమోషన్స్ లోను సందడి చేశాడు. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగానే.. కొద్ది గంటల క్రితం హిట్ 3 నుంచి ట్రైలర్ రిలీజై అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది.

Nani: Nani's 'Hit-3' Trailer Released, Promises High-Octane Action

ప్రస్తుతం యూట్యూబ్‌లో షేర్ చేస్తున్న ఈ ట్రైలర్.. రిలీజ్ అయిన 24 గంటల్లోనే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. విడుదలైన 24 గంటల్లో ఏకంగా 21.30 మిలియన్ వ్యూస్‌ను సంపాదించుకున్న హిట్ 3.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ట్రైల‌ర్‌కు అత్యధిక వ్యూస్‌తో పాటు.. లైకులు కూడా వచ్చాయి. కాగా.. చరణ్, ఎన్టీఆర్ మల్టిస్టార‌ర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో.. 20.45 మిలియన్ వ్యూస్ ను దక్కించుకోగా.. తాజాగా హిట్ 3 ఆ రికార్డును బద్దలు కొట్టి సంచలనం క్రియేట్ చేసింది.

HIT: The Third Case - Wikipedia

ఈ క్రమంలోనే నాని ఫ్యాన్స్ అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమాల్లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన తెలుగు ట్రైలర్ మాత్రం పుష్ప 2. ఇది రిలీజ్ అయిన 24 గంటల్లోనే 44.67 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక ఈ హిట్ 3 సినిమా.. మే 1న ఆడియన్స్‌ను పలకరించనుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.