మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలకు క్లింకార జన్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉపాసన తన బిడ్డను గాజు బొమ్మలా ఎంతో అపురూపంగా పెంచుకుంటూ వస్తుంది. అయితే పెళ్లైన పదేళ్ల వరకు ఈ దంపతులు పిల్లలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీళ్లు ఇంకా పిల్లలను ఎందుకు కనడం లేదంటూ ఎన్నో రకాల సందేహాలు నెటింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్లో పాల్గొన్న ఉపాసన.. వాళ్ళ పిల్లల కోసం ఎందుకు అంతకాలం ఆగారు అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. అందరూ కూడా చరణ్, ఉపాసన తల్లిదండ్రులు ఎప్పుడు కాబోతున్నారని ఎదురుచూస్తున్నారు అన్న ప్రశ్నకు గతంలో ఆమె రియాక్ట్ అయింది.
అది మా జీవితంలో చాలా స్పెషల్. పిల్లల పెంపకం అనేది ఒక 20 ఏళ్ల బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. అలాగే లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్. అయినా.. 20 ఏళ్లు మాత్రం చాలా స్పెషల్. వారితో ఎంతో క్లోజ్ గా ఉండాలి. ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని ఉపాసన చెప్పుకొచ్చింది. పిల్లల లైఫ్ కోసం పేరెంట్స్ 20 ఏళ్ల జీవితాన్ని తప్పకుండా అంకితం ఇవ్వాల్సి ఉంటుందని.. ఉపాసన చెప్పుకొచ్చింది. ఇక పిల్లలకు కావాల్సినవన్నీ ముందే సమకూర్చాలి.. తప్పకుండా వాటిని పొట్టబోయే పిల్లలకు అందించాలని ఆలోచనతో మేమున్నాం అంటూ వివరించింది.
దాంతోపాటే పిల్లల విషయంలో మరికొంత నాలెడ్జ్ ను కూడా సంపాదించుకుంటున్నాం.. ఎంతో జాగ్రత్తగా పిల్లలను పెంచాలి.. ఆ గుడ్ న్యూస్ కోసం మానసికంగా, శారీరకంగా కూడా సిద్ధంగా ఉండాలి అంటూ ఉపాసన వివరించింది. అలాగే పిల్లలను ఇది ఒక 20 ఏళ్ల ఛాలెంజింగ్ రోల్. ఎందుకంటే.. పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత 20 ఏళ్ళు వెనక్కి చూసుకుంటే నేను ఎలా పెంచాను అనేది అందరికీ తెలియాలి.. అది కూడా చాలా ముఖ్యం. అందుకే ఇంత ఆలస్యం అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉపాసనా.. క్లీంకార విషయంలో ఎంత చక్కటి ప్లానింగ్ చేసుకుందో క్లారిటీ వచ్చేసింది.