చరణ్ – సుకుమార్ కాంబో ముహూర్తం ఫిక్స్..!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి టాలీవుడ్ మెగాస్టార్‌గా వ‌రుస‌ సక్సెస్‌లు అందుకున్నాడు చిరంజీవి. ఈ క్రమంలోనే ఆయన న‌టించిన ఎన్నో సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆడియన్స్‌ను మెప్పించేలా సత్తా చాటుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తనయుడుగా.. నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. తండ్రికి మించిన తనయుడుగా సత్తా చాటుతున్నాడు. గ్లోబల్ ఇమేజ్ తో రాణిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా పెను ప్రభంజనం సృష్టించినందుని సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన పెద్ది గ్లింప్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న క్ర‌మంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి. ఇక.. ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమా చేయడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే వీళ్ళ కాంబోలో రంగస్థలం వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు.. చరణ్‌లోని పూర్తిస్థాయి నటుడిని ఆడియన్స్‌కు పరిచయం చేసిన సినిమా కూడా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు.

Ram Charan will definitely win National Award for Game Changer: Sukumar

ఈ నేప‌ద్యంలోనే మ‌రోసారి రిపీట్ కానున్న ఈ కాంబోపై మంచి హైప్ నెల‌కొంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి రానుంద‌ని.. ముహూర్తం ఫిక్స్ అయ్యింది అంటు స‌మాచారం. ఇక చ‌ర‌ణ్ పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోని మరోసారి వీళ్ళిద్దరికీ కాంబో వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో సెట్స్ పైకి రానుంద‌ట‌. ఈ సినిమాలో చరణ్‌ను సుకుమార్ ఏ లెవెల్లో చూపించనున్నాడు. సినిమా ఏ లెవెల్ లో ఉండనుందో అనే ఆసక్తి అభిమానంలో మొదలైంది. అయితే ఈ వివరాలన్నీ తెలియాలంటే టీం మ‌రింత‌ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.