టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తాను తెరకెకించే ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాడో.. ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో తెలిసింది. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో తిరుగులేని డైరెక్టర్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జక్కన్న.. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29లో బిజీగా గడుపుతున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. బాహుబలితో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ రేంజ్ లో సత్తా చాటుకున్న జక్కన్న.. ఇప్పుడు పాన్ వరల్డ్ మార్కెట్ పై కన్నేశాడు.
ఈ క్రమంలోనే మహేష్‌ను హాలీవుడ్ హీరోలకు ధీటుగా.. గ్రాండ్ లెవెల్లో లాంచ్ చేయనున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధిస్తానని నమ్మకంతో ఉన్న జక్కన్న.. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్ జేమ్స్ కామెర్ లాంటి దర్శకులతో సైతం ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి బాధ్యత మరింతగా పెరిగింది. ఇక ఈ సినిమాతో మహేష్ సక్సెస్ అందుకుంటే.. తర్వాత తాను ఏ సినిమా తెరకెక్కించిన పాన్ వరల్డ్ లెవెల్లో ఫేమస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పేస్‌లో రాజమౌళి నెక్స్ట్ సినిమా హీరో ఎవరో అవుతారు.. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ ఇప్పటికే ఈయన సినిమాల్లో హీరోలుగా నటించేశారు. ఎస్ఎస్ఎంబి 29 తో మహేష్ బాబు కూడా అదే లిస్టులో చేరిపోతాడు.
తర్వాత జక్కన్న డైరెక్ట్ చేయబోయే హీరో ఎవరు ఉంటాడనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే రాజమౌళి నెక్స్ట్ సినిమాలో నటించబోయే హీరో చాలా లక్కీ. జాక్పాట్ ఆఫర్ కొట్టేసినట్టే అనడంలో అతిశయోక్తి లేదు. అయితే.. రాజమౌళి నెక్స్ట్ చేయబోయే సినిమాల్లో నటించగల హీరోలుగా ఇద్దరు పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. అందులో నాచురల్‌ల్ స్టార్ నాని పేరు మొదట వినిపిస్తుంది. మరో హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక బన్నీ ఇప్పటికే పాన్ ఇండియన్ స్టార్‌గా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళి నెక్స్ట్ సినిమాకు కచ్చితంగా నాని ఏ హీరో అయ్యా అవకాశం ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి నాని మధ్య మంచి బాండ్ కూడా ఉన్న క్రమంలో.. జక్కన్న తన నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేస్తాడో వేచి చూడాలి. కాగా.. చాలా శాతం మాత్రం నాని పేరే వినిపిస్తుంది. ఒకవేళ ఇద్దరు హీరోలు కాకుండా మరేహీరోనైనా.. జక్కన్న సెలెక్ట్ చేసుకుని సినిమాతో సక్సెస్ అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు.