టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్గా దూసుకుపోతున్న సుకుమార్.. తన ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ గా నిలుపుతున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీతో క్రియేటివ్ డైరెక్టర్‌గా సత్తా చాటుకున్న సుక్కుమార్.. ఆయన శిష్యులను సైతం ఇండస్ట్రీలో దర్శకలుగా తీర్చిదిద్దాడు. వాళ్ళంతా ప్రస్తుతం మంచి సక్సెస్లు అందుకుంటూ రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడుగా పరిచయమై.. మొట్టమొదటి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు సన్నా ఒకడు. ప్రస్తుతం హీరోగా పెద్ది సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ కొట్టాలని.. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్గా సక్సెస్ అందుకోవాలని ఆరాటపడుతున్నాడు. తన గురువు సుకుమారును అందుకోవాలంటే ఈ సినిమాతో ఎలాగైనా ఆ రేంజ్ సక్సెస్ అందుకోవడం అవసరం. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే బుచ్చిబాబుకు పాన్ ఇండియా లెవెల్లో టాప్ డైరెక్టర్ గా ఇమేజ్ క్రియేట్ అవుతుంది అనడంలోనూ సందేహం లేదు. ఈ క్రమంలోనే బుజ్జి బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. తన్ను రాబోయే సినిమాను ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా ప్లాన్ చేస్తున్నాడని.. ఇద్దరు క్రేజీ హీరోలు సినిమాలో నటించబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
హీరోలు ఎవరైనా విషయాలపై సరైన క్లారిటీ లేకున్నా.. ఈ విషయంపై తానే క్లారిటీకి వచ్చిన తర్వాత హీరోల పేర్లు స్వయంగా చెబుతానని బుచ్చిబాబు సన్నా వెల్లడించాడు. ఏదేమైనా బుచ్చిబాబు తన నెక్స్ట్ ప్రాజెక్టును మల్టీ స్టారర్‌గా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. ఇక ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా ఆర్‌ఆర్ఆర్ సినిమా రూపొందించి సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక బుచ్చిబాబు సన్నా కూడా ఈ రేంజ్ లోనే తన మల్టీ స్టారర్ రూపొందించనున్నాడట. కచ్చితంగా బాక్స్ ఆఫీస్ పెను ప్రభంజనం ఖాయమని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాలంటే ఆయన అఫీషియల్ గా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.