హీరో ఉపేంద్ర భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా.. స్టార్ హీరోతోను రొమాన్స్‌..!

సౌత్‌ స్టార్ హీరో ఉపేంద్రకు తెలుగు ఆడియన్స్‌లో ప‌రిచ‌యాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్న‌ ఇప్పటికీ మంచి క్రేజ్‌తో ఇండ‌స్ట్రీలో కొనసాగుతున్న ఉపేంద్ర‌.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటున్నాడు. ఓ పక్కన హీరోగా సత్తా చాటుతూనే.. మ‌రో ప‌క్క ద‌ర్శ‌కుడుగా, విల‌న్‌గాను వ్య‌వ‌హ‌రిస్తూ టాలెంటెడ్ సెల‌బ్రెటీగా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు.

Priyanka Upendra's Birthday Celebration Photos - IBTimes India

కాగా తన 25 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 60 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఉపేంద్ర‌.. పదుల సంఖ్యలో సినిమాల‌కు దర్శకుడిగాను వ్యవహరించాడు. మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా సౌత్ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయ‌న‌ భార్య కూడా.. టాలీవుడ్‌లో ఓ క్రేజీ హీరోయిన్. తెలుగులో పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఆమె.. ప్రియాంక త్రివేది. మొదట మోడలింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ అమ్మడు.. మిస్ కొల్‌క‌త్త‌ కిరీటాన్ని అందుకుంది.

Suri (2000 film) - Wikipedia

తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ప‌లు సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకున్ని నటించింది. కాగా ప్రియాంక త్రివేది పేరు చెప్తే టక్కున ఐడియా రాకపోవచ్చు. కానీ.. జెడి చక్రవర్తి న‌టించిన సూరి మూవీ హీరోయిన్ అంటే వెంటనే గుర్తువ‌స్తుంది. దీంతోపాటే.. ఉపేంద్ర హీరోగా నటించిన రా, h2o, సినిమాలోని హీరోయిన్గా ప్రియాంక నటించింది. ఈ క్రమంలో ఆయనను ప్రేమించే వివాహం చేసుకుంది వీళ్ళకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. కాగా ఈ అమ్మడు 50 కి పైగా సినిమాల్లో నటించగా.. తెలుగు కంటే కన్నడ, తమిళ, బెంగాలీ భాషలో ఎక్కువగా మెరిసింది.