టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఉప్పెనా ఫేమ్ బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 27న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు. తర్వాత.. సుకుమార్ డైరెక్షన్‌లో చరణ్ మరో సినిమాకు కమిటీ అయ్యారు. ఇక గతంలో సుకుమార్, చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. ఈ కాంబో మూవీపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులతో చరణ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ వార్తలన్నీ నిజం చేస్తూ.. మొదట సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ఓ సినిమాకు చరణ్‌ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. యానిమల్ సినిమాతో ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయిన సందీప్ రెడ్డి.. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన లైనప్ లో రణబీర్ కపూర్ యానిమల్ పార్క్ ఉంది. వీటితో పాటే బన్నీతోను.. సందీప్ రెడ్డి సినిమాను కమిట్ అయిన సంగతి తెలిసిందే. గతంలోనే టీ సిరీస్ బ్యానర్‌పై వీరిద్దరు కాంబోలో సినిమాలు ప్రకటించారు. అయితే అనౌన్స్మెంట్ తప్ప సినిమాకు సంబంధించిన మరే ఇతర అప్డేట్ కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు.
అసలు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా లేదా అని అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. కాగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్ సైట్స్ పైకి రానిందని.. కానీ బన్నీ ప్లేస్ లో చరణ్ ఈ సినిమాలో నటించబోతున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. బన్నీ పుష్ప 2 టైంలో సందీప్ రెడ్డి ప్రాజెక్టును అఫీషియల్ గా ప్రకటించాడు. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. పుష్ప 2 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తన నెక్స్ట్ సినిమాను అట్లి, త్రివిక్రంలతో బన్నీ చేయనున్నాడు. తర్వాత పుష్ప 3 ఆయన లైన్ అప్ లో ఉండనే ఉంది. ఇవి పూర్తికావడానికి ఎలా అయినా నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి ప్రాజెక్టులోకి.. బన్నీని తప్పించి చరణ్ ని ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే పెద్ది, సుకుమార్ ప్రాజెక్టుల తర్వాత చరణ్ నెక్స్ట్ చేయబోయే సినిమా సందీప్ రెడ్డి వంగతోనే ఉంటుంది.