నందమూరి నటసింహం బాలకృష్ణకు సంబంధించిన ఓ తాజా అప్డేట్ నెటింట వైరల్ గా మారుతుంది. ఆయన ప్రస్తుతం బోయపాటి శీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. గతంలో.. బాలయ్య అఖండ తెరకెక్కి ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ మాటలో చెప్పాలంటే.. ఈ సినిమాతోనే బాలయ్యకు మళ్ళీ మహర్దశ ప్రారంభమైంది.
ఈ క్రమంలోనే.. బోయపాటి బాలయ్యతో అఖండ 2 పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా షూట్ మొత్తం పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీం బిజీ కానున్నారు. దీంతో బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం చేశాడని.. డైరెక్టర్ గోపీచంద్ మల్లినేనితో మరోసారి చేతులు కలిపనునట్లు తెలుస్తుంది. ఇక గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వీర సింహారెడ్డి సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మరోసారి ఈ కలయికలో అఖండ 2 తర్వాత సినిమా సెట్స్ పైకి రానుందట. ఇప్పటికే ఈ సినిమా విషయమై బాలయ్య తో గోపీచంద్ చర్చలు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. దీన్ని మరో నిర్మాణ సంస్థతో కలిసి వృద్ధి సినిమా బ్యానర్ నిర్మించే ఛాన్స్ ఉంది. అయితే మరో నిర్మాణ సంస్థ ఏంటి అనే దానిపై క్లారిటీ రాగానే.. ప్రాజెక్టును అఫీషియల్ గా ప్రకటించనున్నారు. ఇది జూన్లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.