టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సినిమాల విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేను సినిమాలు మానను.. నాకు డబ్బు అవసరం ఉన్నంతవరకు వాటిని ఆపనంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం పవన్ మూడు సినిమాలను లైన్లో ఉంచుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ కేవలం నాలుగు రోజులు డేట్స్ కేటాయిస్తే సినిమా పూర్తవుతుంది. అయితే.. ఇప్పటివరకు పవన్ ఆ నాలుగు రోజుల డేట్స్ ను కేటాయించలేకపోతున్నాడు. అనారోగ్య కారణాలు, క్యాబినెట్ మీటింగ్లు అంటూ హరిహర వీరమల్లు సినిమా షూట్ పూర్తి కాలేదు.
మే 9న సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఆ నాలుగు రోజుల షూట్ మినహా మిగతా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే హరిహరవీరమల్లు ఎప్పుడెప్పుడు వస్తుందంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నటించిన మరో సినిమా ఓజి.. ఇప్పటికి 70% షూట్ పూర్తి చేసినా.. ఈ సినిమాకు 20 రోజుల డేట్స్ మాత్రం కేటాయిస్తే సరిపోతుంది. కాగా 4 రోజుల డేట్స్ ఇవ్వలేకపోతున్న పవన్.. 20 రోజుల డేట్స్ ఎలా ఇస్తాడు అనే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ లైన్లో ఉన్న మరో మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అసలు ఈ మూవీ సెట్స్ పైకి వస్తుందా.. లేదా.. అసలు రిలీజ్ అవుతుందా తెలియని పరిస్థితి నెలకొంది.
ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఓ పాన్ ఇండియన్ స్టార్ట్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. తాజాగా బాలీవుడ్ లో జాట్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ను అందుకున్న తెలుగు దర్శకుడు గోపీచంద్ మల్లినేనీతో.. పవన్ కళ్యాణ్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా.. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఇదే వార్త వైరల్ గా మారుతుంది. ఇక స్వయంగా త్రివిక్రం ఈ క్రేజీ ప్రాజెక్టును తన మిత్రుడు కోసం సిద్ధం చేశాడట. ఓపక్క డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తూ తలుమునకలవుతున్న పవన్ బ్యాలెన్స్ సినిమాలను చేయడానికి నానా అవస్థలు పడుతుంటే.. ఈ కొత్త సినిమా ఎప్పుడు ప్రారంభించాలి.. ఎప్పుడు పూర్తి చేయాలి అంటూ పవన అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.