75 లక్షలు తీసుకుని నితిన్ హ్యాండ్ ఇచ్చాడు.. స్టార్ ప్రొడ్యూసర్

చిరంజీవి విశ్వంభ‌ర‌కు దర్శకుడుగా వ్యవహరిస్తున్న మల్లిడి వశిష్టకు టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఆయన తండ్రి నిర్మాత సత్యనారాయణరెడ్డి కూడా.. అందరికీ సుపరిచితమే. గతంలో డి, బన్నీ, భగీరథ లాంటి సినిమాలను తెర‌కెక్కించి మంచి సక్సెస్‌లు అందుకున్న ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను షేర్ చేస్తున్నాడు. తనకు కొడుకు వ‌శిష్ఠ‌ డైరెక్షన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చిన ఆయన.. నితిన్‌తో సినిమా చేద్దామనుకున్నాను.. ఓ ప్రొడ్యూసర్ని కూడా సెట్ చేశా అంటూవివ‌రించిడు.

ఇక ఆ ప్రొడ్యూసర్‌తో నితిన్‌కి రూ.70 లక్షలు అడ్వాన్స్ కూడా ఇప్పించా. ఇక కెమెరామెన్ చోటా కె నాయుడుకు రూ.10 లక్షలు.. సినిమా పై రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశా. కానీ.. నితిన్ మాతో చేయనని చివర్లో హ్యాండ్ ఇచ్చేశాడంటూ సత్యనారాయణ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఆ టైంలో అఆ రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అందుకోవడంతో.. వ‌శిష్టతో సినిమా చేస్తే రేంజ్ పడిపోతుంది అని వద్దన్నాడు.. అప్పుడు చాలా బాధపడ్డా.. తర్వాత శిరీష్ తో సినిమా చేద్దాం అనుకున్న.. శిరీష్ కూడా మా వాడిని అడిగాడు.. కథ‌ రెడీ చేసుకున్న తర్వాత శిరీష్‌కు శ్రీరస్తు, శుభమస్తుతో హిట్స్ వచ్చాయి.

Bimbisara' director on whether Tarak, Balakrishna will do 2nd part - Tamil  News - IndiaGlitz.com

దాంతో మా వాడితో చేయనని చెప్పేశారు. చివరకు నా కొడుకును హీరోగా పరిచయం చేద్దామని భావించా. కానీ.. వాడు డైరెక్షన్ ఫీల్డ్ లోకి వెళ్లాలనుకున్నాడు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ అవకాశమిచ్చారు. బింబిసారతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు అంటూ సత్యనారాయణ రెడ్డి చెప్పుకొచ్చాడు. మా వ‌శిష్ఠ చాలా కష్టపడ్డాడని.. దానికి తగ్గ ఫలితం వస్తుందంటూ ఆయన వివరించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.